Begin typing your search above and press return to search.
రాజు గారి గది-2 రహస్యాలు చెప్పిన ఓంకార్
By: Tupaki Desk | 10 Oct 2017 1:30 AM GMT‘రాజు గారి గది’తో దర్శకుడిగా నిరూపించుకున్న ఓంకార్.. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ రెడీ చేశాడు. అక్కినేని నాగార్జున.. సమంత లాంటి స్టార్లు నటించిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దీని ట్రైలర్ బాగానే ఆకట్టుకుంది. ఈ శుక్రవారమే ‘రాజు గారి గది-2’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐతే ఈ చిత్రం ఓంకార్ సొంత ఐడియాతో తీసిన సినిమా కాదని.. ఓ మలయాళ సినిమా దీనికి స్ఫూర్తి అని ఇంతకుముందే ప్రచారం జరిగింది. ఐతే ఇప్పటిదాకా ఆ విషయంపై చిత్ర బృందం స్పందించలేదు. ఇప్పుడు స్వయంగా దర్శకుడు ఓంకారే ఈ విషయమై ఓపెనయ్యాడు. ‘రాజు గారి గది-2’కు స్ఫూర్తి ఓ మలయాళ సినిమా అన్న సంగతి వాస్తవమే అని అతను చెప్పాడు.
మలయాళంలో హిట్టయిన ‘ప్రేతమ్’ నుంచి మూల కథ తీసుకుని ‘రాజు గారి గది-2’ స్క్రిప్టు తయారు చేసినట్లు ఓంకార్ తెలిపాడు. ఐతే పూర్తి సినిమా మలయాళం నుంచి తీసుకోలేదన్నాడు. కోర్ పాయింట్ వరకే తనకు ‘ప్రేతమ్’ స్ఫూర్తి అని చెప్పాడు. తాను ఏమేం మార్పులు చేశానన్నది ఇప్పుడు చెప్పనని.. మలయాళ వెర్షన్ చూసిన వాళ్లు తెలుగు వెర్షన్ కూడా చూస్తే తేడా స్పష్టంగా కనిపిస్తుందని ఓంకార్ తెలిపాడు. ముందు ‘రాజు గారి గది-2’ కథను విక్టరీ వెంకటేష్ కు చెప్పినట్లు వచ్చిన వార్తలు కూడా నిజమేనని ఓంకార్ తెలిపాడు. ఐతే అప్పటికి వెంకీ.. ‘గురు’తో బిజీగా ఉండటంతో ఈ సినిమా చేయలేకపోయాడని.. తర్వాత నాగార్జునకు కథ చెప్పగా.. ఆయనకు నచ్చి ఈ సినిమా చేశారని ఓంకార్ వెల్లడించాడు.