Begin typing your search above and press return to search.
తమ్ముడితో ఇంకెన్ని సీక్వెల్స్ బాబు ?
By: Tupaki Desk | 23 Sep 2019 1:30 AM GMTబుల్లి తెరపై ఓ వెలుగు వెలిగి చివరికి మెగా ఫోన్ పెట్టేసాడు ఓంకార్. ముందుగా హావీష్ తో 'జీనియస్' అనే సినిమా తీసి చేతులు కాల్చుకున్న యాంకర్ బాబు ఆ తర్వాత 'రాజు గారి గది' సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. సరిగ్గా హార్రర్ కామెడీ సినిమాల హవా నడుస్తున్న సమయంలో తక్కువ బడ్జెట్ తో తీయడం వల్ల ఆ సినిమాకు నిర్మాతగా మంచి లాభాలు కూడా అందుకున్నాడు.
ఆ సినిమాతో తమ్ముడు అశ్విన్ ని హీరోగా పరిచయం చేసాడు కూడా. కానీ ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా దర్శకుడిగా ఓంకార్ కి అలాగే ధన్ రాజ్ - ప్రభాస్ శ్రీను - విద్యులేఖ ఇలా కొందరు కమెడియన్స్ కే వెళ్ళింది. ఆ సినిమాతో హీరోగా సెటిల్ అవుతాననుకున్న అశ్విన్ కి నిరాశే మిగిలింది. ఎలాగోలా రెండో సినిమా ఆఫర్ తెచ్చుకున్నా అది వర్కౌట్ అవ్వలేదు.
ఇక తమ్ముడిని హీరోగా నిలబెట్టాలని మళ్లీ 'రాజు గారి గది 2' చేసాడు. మార్కెట్ కోసం నాగార్జున తో ఓ స్పెషల్ క్యారెక్టర్ వేయించారు. కట్ చేస్తే అది బోల్తా కొట్టింది. ఇక ఇప్పుడు మళ్లీ కేవలం తమ్ముడిని మాత్రమే హీరోగా పెట్టి రాజు గారి గది3 తీసాడు. ట్రైలర్ లో అశ్విన్ క్యారెక్టర్ హైలైట్ అయ్యేలా చూసుకున్నాడు. సినిమాలో అతనితో రాఘవ లారెన్స్ చేసే టైప్ క్యారెక్టర్ చేయించాడు. ఇక తమ్ముడిని ఈ సినిమాతో అయినా లేపాలని నటుడిగా గుర్తింపు అందివ్వాలని చూస్తున్నాడు. కానీ ప్రేక్షకులు మాత్రం ఓంకార్ సీక్వెల్ అంటే అతని తమ్ముడి కోసం కాకుండా మిగతా వాళ్ళ కోసం థియేటర్స్ కి వెళ్తున్నారు. మరి ఈ సినిమాతో అయినా ఓంకార్ తమ్ముడు అన్నయ్య ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సినిమాకు హైలైట్ అవుతాదేమో చూడాలి.