Begin typing your search above and press return to search.
ఆదిపురుష్ ఫస్ట్ లుక్ : శ్రీరాముడి `అవతార్` దించుతాడా?
By: Tupaki Desk | 12 April 2021 1:30 AM GMTప్రభాస్ కథానాయకుడిగా ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ 3డి చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తుండగా రావణాసురుడిగా సైఫ్ ఖాన్ నటిస్తున్నారు. సీతగా కృతిసనోన్ నటిస్తోంది. లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు.
ఈ చిత్రం కథాంశం ప్రకారం.. ఎక్కువగా స్టూడియోలో చిత్రీకరణ సాగుతోంది. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన విఎఫ్.ఎక్స్ సాంకేతిక నిపుణులతో పని చేయనున్నారు. అవతార్ - స్టార్ వార్స్ వంటి భారీ చిత్రాలకు పనిచేసిన టెక్నికల్ టీమ్ ని ఈ చిత్రం కోసం ఒప్పించారని ప్రచారమైంది. దాదాపు 500కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఆదిపురుష్ 3డి 2022 ఆగస్టు 11న థియేటర్లలోకి రిలీజ్ కానుంది.
తాజా సమాచారం మేరకు ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసేందుకు ఓంరౌత్ బృందం సన్నాహకాల్లో ఉన్నారని తెలిసింది. డార్లింగ్ లుక్ ఎలా ఉండాలి? అన్నదానిపైనా తర్జనభర్జన సాగించారట. అయితే శ్రీరాముడి పట్టాభిషేకం లుక్ ని లాంచ్ చేస్తే వేగంగా ఆడియెన్ లోకి దూసుకెళ్లేందుకు ఛాన్సుంటుందని దర్శకుడు భావిస్తున్నారట.
అయితే ఈ సినిమాలో ప్రభాస్ లుక్ పై అభిమానుల్లో చాలా అంచనాలున్నాయి. అతడు నీలి మేఘ శ్యాముడిగా బ్లూ కలర్ లో కనిపిస్తాడని మరో అవతార్ ని తలపిస్తాడని ఊహించుకుంటున్నారు. ఇక పురాణేతిహాసం రామాయణంలో అతడి రూపం నీలం రంగులోనే మన రచయితలు ఎలివేట్ చేశారు. అందువల్ల చాలా ఎక్కువ అంచనాలే ఏర్పడుతున్నాయి. ఇక రామాయణంలో శ్రీరాముడు ఆంజనేయుడి తోక స్ఫూర్తితోనే అవతార్ సినిమాని అందులో క్యారెక్టర్లను జేమ్స్ కామెరూన్ సృష్టించారు.
అలాంటప్పుడు మనవాళ్లు మనదైన పురాణేతిహాసంలోని పాత్రను ఎలివేట్ చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్నది ఆసక్తిగా మారింది.