Begin typing your search above and press return to search.
'పవర్ స్టార్' సినిమా ఏ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ చేస్తారు..?
By: Tupaki Desk | 12 July 2020 5:50 AM GMTకరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించడం మొదలుపెట్టినప్పటి నుండి సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన సినిమాలతో జనాల్ని వణికించడం స్టార్ట్ చేశాడు. గత నాలుగు నెలలుగా సినీ ఇండస్ట్రీ క్లోజ్ అయింది కానీ వర్మ సినిమాలు మాత్రం ఆగలేదు. కరోనా నా కోసమే వచ్చింది అనే రేంజ్ లో వరుస పెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. ప్రకటించడమే కాకుండా ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ కూడా చేశాడు. సినిమాలు రిలీజ్ చేయడానికి థియేటర్స్ రీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదంటూ సొంతంగా శ్రేయాస్ ఎంటెర్టైన్మెంట్ వారితో కలిసి 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్' అనే ఏటీటీ స్టార్ట్ చేసి తన సినిమాలన్నీ ఇక్కడే విడుదల అవుతాయని చెప్పుకొచ్చాడు. వెబ్ కంటెంట్ కి సెన్సార్ కూడా లేకపోవడంతో రెచ్చిపోయిన వర్మ 'క్లైమాక్స్' 'నగ్నం' లాంటి సినిమాలను వదిలాడు. ఈ క్రమంలో 'పవర్ స్టార్' అనే వివాదాస్పద టైటిల్ తో సినిమా తీస్తున్నానని వెల్లడించి సంచలనం రేపాడు. అక్కడితో ఆగకుండా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్' లో త్వరలోనే రిలీజ్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు 'పవర్ స్టార్' సినిమా శ్రేయాస్ ఎంటెర్టైన్మెంట్ 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్' లో రిలీజ్ అవుతుందా లేదా అనేది అనుమానంగా మారింది.
'పవర్ స్టార్' సినిమా నిజ జీవితంలోని ఏ వ్యక్తిని ఉద్దేశించి తీస్తుంది కాదని.. పొలిటికల్ పార్టీ స్థాపించి ఎన్నికలలో ఓడిపోయిన ఓ స్టార్ హీరో స్టోరీ అని.. ఏ వ్యక్తికైనా దగ్గర పోలికలు ఉంటే అది యాదృచ్చికంగా జరిగింది మాత్రమేనని రామ్ గోపాల్ వర్మ చెప్తున్నా ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి తీస్తున్నారని చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. ఈ క్రమంలో ఈ వివాదాస్పద సినిమాని రిలీజ్ చేయడానికి శ్రేయాస్ ఎంటెర్టైన్మెంట్ వారు ముందుకు వస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే దీని పై శ్రేయాస్ అధినేత శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. ఆయన మాట్లాడుతూ 'పవర్ స్టార్' శ్రేయాస్ ఈటీ యాప్ లో విడుదల చేయడం లేదని పేర్కొన్నారట. 'పవర్ స్టార్' సినిమా మాత్రమే కాదు.. వివాదాస్పదమయ్యే ఏ సినిమాను మేము విడుదల చేయమని ఆయన ప్రకటించారట. కానీ వర్మ మాత్రం తన 'పవర్ స్టార్' సినిమాని 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్' లో రిలీజ్ చేస్తున్నామంటూ ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నాడు. మరి ఈ వివాదాస్పద చిత్రాన్ని ఏ ప్లాట్ ఫార్మ్ పై రిలీజ్ చేస్తారనే విషయంలో రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.