Begin typing your search above and press return to search.
చీర కట్టులోనే వెరైటీస్ ని పరిచయం చేసారు
By: Tupaki Desk | 23 Aug 2021 5:43 AM GMTకేరళ రాష్ట్రంలో `ఓనమ్` చాలా పెద్ద పండుగ. దక్షిణాది రాష్ట్రాల్లో కొన్నిచోట్ల పలు మారుమూల ప్రాంతాల్లోనూ ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కేరళలో అయితే ప్రతీ ఏటా చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. అందులోనూ సెలబ్రిటీలు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. కేరళ కుట్టీలంతా చీర కట్టుతో సాంప్రదాయ బాణీతో ఆకర్షిస్తారు. సాధారణంగా పండగల వేళ సాంప్రదాయాన్ని విడవకుండా చీరకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు మల్లూ భామలు. ఇక `ఓనం` సందర్భంగా చీరలోనే రకరకాల వెరైటీలను పరిచయం చేస్తుంటారు. ఈనెల 23న ఓనం పండుగ సందర్భంగా కేరళ కుట్టీలంతా చీర సొగసును ప్రదర్శించేందుకు తహతహలాడారు.
కేరళ నుంచి హైదరాబాద్ కి వచ్చి ఎంతో మంది కేరళ కుట్టీలు అగ్ర హీరోయిన్లు అయ్యారు. ప్రస్తుతం కీర్తి సురేష్.. రష్మిక మందన్నా.. మాలవిక మోహనన్ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్లగా వెలిగిపోతున్న సంగతి తెలిసిందే. కేరళ భామలుగా పరిచయమై తెలుగింట అమ్మాయిల్లా అందరి హృదయాల్ని కొల్లగొడుతున్నారు.` ఓనం` సందర్భంగా ఈ భామలంతా చీరకట్టులోకి ఒదిగిపోయారు. ప్రీ ఓనం ఫెస్టివల్ లో చీర కట్టులోనే వెరైటీస్ ని పరిచయం చేసారు. ఖరీదైన చీరల్ని ధరించి ధగధగలాడిపోతున్నారు. కీర్తి సురేష్ చీర లుక్ లో కనిపించడం కొత్తేం కాదు. ఆన్ స్క్రీన్ తో పాటు..ఆఫ్ ది స్క్రీన్ లోనూ కీర్తి తెలుగింట పదహారణాల ఆడపడుచునే తలపిస్తోంది.
తెలుపు జాకెట్ పై పూవులతో కూడిన డిజైనర్ జాకెట్..క్రీమ్ కలర్ చీరని కీర్తి ధరించింది. ఈ సారీలో రకరకాల ఫోజులతో ఆకట్టుకుంటుంది. ఇక రష్మిక మందన్నా ముదురు ఎరుపు డిజైన్ జాకెట్ లో..డార్క్ బ్రౌన్ రంగు చీర కట్టుకుంది. తలపై ఓనం ప్రత్యేకతను ఆవిష్కరిస్తూ పూలమాల ధరించి చిరు నవ్వులు చిందిస్తోంది. రష్మిక అలా ఠీవిగా కూర్చుని ఫోజులిచ్చింది. మాళవిక మోహనన్ గులాబీ రంగు జాకెట్...లేలేత క్రీమ్ కలర్ సారీలో ఆకట్టుకుంటుంది. ఈ ముగ్గురు ఓ రిసార్ట్స్ లో గేదర్ అయి ఇలా కెమెరాకు ఫోజులిచ్చారని అర్థమవుతోంది. నయనతార- అశిన్ -నిత్యామీనన్ లాంటి సీనియర్ నాయికలు ఓనమ్ పండుగను సీరియస్ గానే జరుపుకుంటారు. చీరకట్టులో ఆ ఇద్దరి అందచందాలు అన్నివేళలా అభిమానుల మనసుల్ని దోచాయి.