Begin typing your search above and press return to search.

మళ్ళీ నిరాశపరిచిన మ్యాచో హీరో

By:  Tupaki Desk   |   6 Oct 2019 11:08 AM GMT
మళ్ళీ  నిరాశపరిచిన మ్యాచో హీరో
X
ఎదాదికో సినిమా చేస్తూ వస్తున్న మ్యాచో హీరో గోపీచంద్ లేటెస్ట్ గా 'చాణక్య'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నిన్న గ్రాండ్ గా విడుదలైన ఈ స్పై యాక్షన్ సినిమాతో ప్రేక్షకులను మళ్ళీ నిరాశ పరిచాడు గోపీచంద్. తమిళ దర్శకుడు తిరు మీదున్న నమ్మకంతో ఈ సినిమా చేసిన గోపి ఘోరంగా బోల్తా కొట్టాడు. తొలి రోజు ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయాడు.

ఈ మధ్య గోపీచంద్ నటించిన 'గౌతమ్ నంద', 'పంతం' సినిమాలు నిరాశ పరిచి ఫ్లాపు సినిమాలుగా మిగిలిపోయాయి. లేటెస్ట్ గా 'చాణక్య' కూడా అదే కోవలోకి చేరింది. సినిమా చూసాక రీలీజ్ కి ముందు ఈవెంట్ లో సినిమా మీద గోపీచంద్ ఓవర్ కాన్ఫిడెన్స్ , ఈ సారి గట్టిగా కొడతానంటూ అరిచిన అరుపులు అన్నీ గుర్తుచేసుకుంటున్నారు ఆడియన్స్. నిజానికి ఏ హీరోకైనా తన సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ ఈసారి గోపీచంద్ ఆ లిమిట్ దాటేసి మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టేసుకొని స్పీచ్లు ఇచ్చాడు.

స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన 'చాణక్య'ను అసలు లాజిక్కులు పట్టించుకోకుండా తెరకెక్కించిన విధానానికి దర్శకుడిపై విమర్శలు వచ్చాయి. క్రిటిక్స్ కూడా ఇదో ఆర్డినరి సినిమా అని తేల్చేసారు. మరి తదుపరి చేయబోతున్న 'అడ్వెంచర్', 'స్పోర్ట్స్ డ్రామా' సినిమాలతో అయిన మ్యాచో హీరో అందరినీ అలరించి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకోవాలని ఆశిద్దాం.