Begin typing your search above and press return to search.
అన్నను అంత మాట అనేస్తావా? మెగా అభిమానుల్లో గుర్రు?
By: Tupaki Desk | 26 Sep 2021 3:30 PM GMTమరోసారి మెగా అభిమానులు రెండుగా చీలిపోయారా? మెగాస్టార్ చిరంజీవిని విపరీతంగా అభిమానించే వారు.. ఆయన్ను అమితంగా ప్రేమించే వారు.. ఆయన తమ్ముడన్న కారణంగా పవన్ కల్యాణ్ ను అభిమానించటం తెలిసిందే.పవన్ మీద అభిమానం ఉన్నా.. వారి మొదటి ప్రయారిటీ మాత్రం మెగాస్టారే. అదే రీతిలో తమ్ముడు పవన్ కు ఫిదా అయి.. ఆయన 'పవర్' ఇమేజ్ ను పిచ్చి పిచ్చిగా ప్రేమించే వారు లేకపోలేదు. వారిలో చాలామంది చిరంజీవి ఇష్టమే అయినా.. పవనే వారికి మొదటి ప్రయారిటీ.
అంతేనా మెగా అభిమానుల్లో బన్నీ ఫ్యాన్స్ కు పవన్ ఫ్యాన్సుకు మధ్యనున్న రిలేషన్ అందరికి తెలిసిందే. ఇలాంటి లెక్కలు డొక్కలు ఒక వైపు.. అప్పుడప్పుడు పైకి లేవటం.. అంతలోనే.. మనమంతా ఒక్కటే కదా? అన్న భావనతో సర్దుకోవటం మామూలే. ఇదిలా ఉంటే.. తాజాగా 'రిపబ్లిక్' మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ వేళ.. పవన్ చేసిన ఆవేశపూరిత ప్రసంగంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
వైసీపీ నేతల్ని మాత్రమే కాదు.. తన సోదరుడు.. తన దైవ సమానుడిగా అభివర్ణించటమే కాదు.. అదే సభలో తన జీవితంలో తాను రాజకీయ నేతను.. సినిమా స్టార్ ను కావాలని అనుకోలేదని.. ఒక పుస్తకాల కొట్టో.. మొక్కల దుకాణమో.. లేదంటే చిరంజీవికి బాడీగార్డుగా ఉండాలనుకున్నానని చెప్పిన పవన్.. అదే ప్రసంగంలో మరో చోటమాత్రం తన అన్న తీరును తప్పు పట్టారు.
ఏపీ మంత్రి ఒకరు సీఎం జగన్.. చిరంజీవి మధ్య సోదరభావం ఉందన్నారని.. అవసరానికి అక్కరకు రాని సోదరభావం ఎందుకు? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. తెగే వరకూ దేన్ని లాగకూడదని.. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయన్న ఘాటువ్యాఖ్య చేశారు.
అంతేకాదు.. ఇండస్ట్రీకి సాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని చిరంజీవి అభ్యర్థించిన వైనాన్ని ప్రస్తావిస్తూ..ఆయనది మంచితనం అని చెబుతూనే.. మరో సందర్భంలో మన హక్కును మనం గట్టిగా అడగాలి కదా? ప్రశ్నించకుంటే ఎలా? అని ప్రశ్నించటం ద్వారా.. చిరంజీవి గట్టిగా మాట్లాడలేకపోతున్నారన్న విషయాన్ని పవన్ స్పష్టం చేసినట్లైంది. ఈ వ్యాఖ్యలు చిరు అభిమానులకు ఇబ్బందిగా మారినట్లు చెబుతున్నారు. అన్న మీద పవన్ గౌరవాన్ని శంకించటం లేదని.. కాకుంటే.. ఆవేశం వస్తే.. అన్నను సైతం ఏదో ఒక మాట అనేసే తీరు ఏ మాత్రం బాగోలేదన్న మాట చిరు అభిమానుల నోట వినిపిస్తోంది. ఈ ఆవేశం.. తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా కొత్త తిప్పలు తీసుకురావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.మరేం జరుగుతుందో కాలమే డిసైడ్ చేయాలి.