Begin typing your search above and press return to search.
మరోసారి విషమించిన సీనియర్ హీరో ఆరోగ్యం
By: Tupaki Desk | 1 Sep 2021 8:47 AM GMTకోలీవుడ్ సీనియర్ హీరో, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కోలుకొని బయటకు వచ్చిన ఆయన మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
కోలీవుడ్ సీనియర్ హీరో, డీఎండీకే పార్టీ అధినేత విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పుకార్లు వస్తూనే ఉన్నాయి. అలా పుకార్లు వచ్చిన ప్రతిసారి పార్టీ దాన్ని ఖండిస్తోంది.
విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి కాస్త ఇబ్బందిగా మారినట్టు తెలుస్తోంది. అత్యవసర వైద్య చికిత్సల కోసం చెన్నై నుంచి దుబాయ్ వెళ్లారు విజయ్ కాంత్. కుమారుడుతో కలిసి చికిత్స కోసం చెన్నై ఎయిర్ పోర్టు నుంచి దుబాయ్ ప్రయాణం అయ్యారు. ఆయన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిని బట్టి అక్కడి నుంచి అమెరికాకు కూడా తీసుకెళతారని సమాచారం. తీవ్ర అనారోగ్యం ఒకవేళ దుబాయ్ లో చూపించన తర్వాత నయం కాకుంటే అమెరికాకు తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు.
కొంత కాలంగా విజయ్ కాంత్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గత ఏడాది కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత చికిత్స తీసుకొని సురక్షితంగా బయటపడ్డాడు. కానీ తర్వాత మళ్లీ ఆయనకు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో ఇప్పుడు అత్యవసరంగా దుబాయ్ తీసుకెళుతున్నారు.
కొన్నాళ్లుగా విజయ్ కాంత్ పబ్లిక్ మీటింగ్స్ లో కనిపించడం లేదు. అడిగితే కరోనా వైరస్ కారణంగా బయటకు రావడం లేదు అంటున్నారు. అంతర్గతం కూడా విజయ్ కాంత్ మాట్లాడడం లేదు. వీడియో కాన్ఫరెన్స్ లలోనూ కనిపించకపోవడం ఆయన ఆరోగ్యంపై అనుమానాలకు తావిస్తోంది.
కరోనా సైడ్ ఎఫెక్టుల వల్ల విజయ్ కాంత్ ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదని.. ఆయన అవయవాలు డ్యామేజ్ అయ్యాయనే వార్తలు వస్తున్నాయి.తాజాగా మెరుగైన చికిత్స కోసం దుబాయ్ కి.. అక్కడ సాధ్యం కాకపోతే అెరికాకు వెళ్లేందుకు రెడీ కావడంతో మరోసారి ఈ హీరో కం పొలిటీషియన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి.