Begin typing your search above and press return to search.
కొత్త పాత్రలో గోదావరి మరదలు
By: Tupaki Desk | 13 Oct 2015 1:30 PM GMTగోదావరి సినిమాలో సుమంత్ మరదలిగా.. మహంకాళి వంటి సినిమాలో స్పయిసీ గాళ్ గా.. తెలుగు ప్రేక్షకులకు కనిపించిన ముద్దుగుమ్మ నీతు చంద్ర. తమిళ - కన్నడలో ఈ భామ చాలా సినిమాలనే చేసింది. మాధవన్ తో యావరుం నాలం - జయం రవితో ఆది భగవాన్ వంటి కోలీవుడ్ హిట్స్ ఈ అమ్మడి ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు నీతు చంద్ర కొత్త పాత్రతో అదృష్టం పరీక్షించుకుంటోంది.
ఒన్స్ అపాన్ ఏ టైం అని బీహార్ అనే పేరుతో హిందీ చిత్రాన్ని నిర్మిస్తోంది ఈ బెంగాలీ భామ. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ట్రైలర్.. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో సంచలనం సృష్టిస్తోంది. అక్టోబర్ 30న మూవీని రిలీజ్ చేయబోతోంది నీతు చంద్ర. 2003-04 కాలంలో.. బీహార్ లోని ఓ మారుమూల ప్రాంతంలో జరిగిన యదార్ధ సంఘటనలే ఈ చిత్ర కథ. నితిని నీరా చంద్ర ఈ మూవీని డైరెక్టర్ చేయగా... ప్రధాన పాత్రల్లో ముగ్గురు కొత్త నటులను ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఈ సినిమా ద్వారా. నీతు చంద్ర కొత్త రోల్ లో చేసిన ఫస్ట్ ఎటెంప్ట్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్య సహా అనేకమంది తమిళ యాక్టర్స్ ఇప్పటికే ట్రైలర్ ను ఆకాశానికి ఎత్తేస్తూ.. నీతు ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు.
నిర్మాతగా తన మొదటి మూవీకే ఇంతగా ప్రశంసలు దక్కుతుండడం, రిలీజ్ కి ముందే తనకు మంచి పేరు రావడంతో.. ఫుల్ హ్యాపీగా ఉంది నీతూచంద్ర. సమాజంలో జరిగే అన్యాయాలతో పాటు... మంచి స్టోరీస్ దొరికితే వరుసగా సినిమాలు నిర్మిస్తానని చెబుతోంది.