Begin typing your search above and press return to search.

మూడు నెల‌ల్లో ఒకే ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్

By:  Tupaki Desk   |   19 Feb 2019 4:51 AM GMT
మూడు నెల‌ల్లో ఒకే ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్
X
గ‌డిచిన మూడు నెల‌ల్లో ఒక్క‌టంటే ఒక్క‌టే బ్లాక్ బ‌స్ట‌ర్. న‌వంబ‌ర్.. డిసెంబ‌ర్ .. జ‌న‌వ‌రి.. తో పాటు ఇప్ప‌టివ‌ర‌కూ టాలీవుడ్ ని ప‌రిశీలిస్తే ఒకే ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ న‌మోదైంది. మూడు నెల‌ల్లో `ఎఫ్ 2: ఫ‌న్ & ఫ్ర‌స్టేష‌న్` త‌ప్ప తెలుగు స్ట్రెయిట్ సినిమా ఇంకేదీ ఆడ‌లేదు. చిన్న సినిమాగా వ‌చ్చి పెద్ద హిట్టు సాధించిన `హుషారు` ప్ర‌త్యేక‌త‌ను నిలుపుకుంది. కొత్త కుర్రాళ్ల‌తో తీసిన ఈ చిత్రం సూప‌ర్ హిట్ అన్న టాక్ తెచ్చుకుంది. ఇక క‌న్న‌డ బ్లాక్ బ‌స్ట‌ర్ కేజీఎఫ్ తెలుగులో హిట్ చిత్రంగా నిలిచింది. మిస్ట‌ర్ మ‌జ్ను - విన‌య విధేయ రామ‌ - పేట‌ - క‌థానాయ‌కుడు అన్నీ ఫ్లాప్ లుగా నిలిచాయి.

డిసెంబ‌ర్ రిలీజ్‌లు అన్నీ ఫ్లాపులే.. ప‌డి ప‌డి లేచే మ‌న‌సు - అంత‌రిక్షం 9000కెఎంపిహెచ్ - భైర‌వ గీత‌ - అన‌గ‌న‌గా ఓ ప్రేమ‌క‌థ - ఇదం జ‌గ‌త్ - బ్ల‌ఫ్ మాస్ట‌ర్ - మారి 2 - క‌వ‌చం - సుబ్ర‌మ‌ణ్య పురం - నెక్ట్స్‌ ఏంటి? ఓడియ‌న్ - ఆప‌రేష‌న్ 2019 - శుభ లేఖ‌+లు అన్నీ ఫ్లాపులే. శ‌ర్వానంద్ - వ‌రుణ్ తేజ్ ల‌పై ఆశ‌లు పెట్టుకుంటే ఆ ఇద్ద‌రూ తీవ్రంగానే నిరాశ‌ప‌రిచారు. అంత‌రిక్షం - ప‌డి ప‌డి లేచే మ‌న‌సు ఫ్లాపులు తీవ్రంగా నిరాశ‌ప‌రిచాయి. మోహ‌న్ లాల్ ఓడియ‌న్ భారీ ప్ర‌యోగం అన్న టాక్ రావ‌డంతో ఆస‌క్తి పెరిగింది. తెలుగులోనూ కొద్ది పాటి అంచ‌నాల‌తో రిలీజైన‌ డ‌బ్బింగ్ సినిమా. మ‌ల‌యాళంలో ఆడినా ఇక్క‌డ‌ ఆడ‌లేదు. సుమంత్ న‌టించిన సుబ్ర‌మ‌ణ్య పురం చిత్రానికి మంచి టాక్ వ‌చ్చినా హిట్టు అన్న మాట విన‌ప‌డ‌లేదు. నాగ‌చైత‌న్య స‌వ్య‌సాచి న‌వంబ‌ర్ లో రిలీజై తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది.

ఇక అంతా భ‌విష్య‌త్ పైనే ఆశ‌..! కొత్త ఏడాదిలో రెండో నెల ముగింపుకి వ‌చ్చేసింది. ఇక భ‌విష్య‌త్ ఆశ‌ల‌న్నీ రాబోవు చిత్రాల‌పైనే. ఈ స‌మ్మ‌ర్ లోనూ ప‌రీక్ష‌ల గండం.. వేస‌వి హీట్ గండం.. క్రికెట్ గండం.. సినిమాల‌కు పొంచి ఉంది. దీంతో ఈ మార్చి - ఏప్రిల్ కూడా ఆశావ‌హం అని చెప్ప‌లేం. మ‌హేష్ 25వ సినిమా `మ‌హ‌ర్షి` మంచి ఊపు తెస్తుంద‌నే అంచ‌నా ఉంది. నాగ‌చైత‌న్య - స‌మంత జోడీ న‌టిస్తున్న `మ‌జిలీ`పైనా ఆశ‌లు ఉన్నాయి. ఇక ఫ్లాప్ హీరోలుగా ముద్ర ప‌డిన‌వాళ్ల సినిమాలు రిలీజ్ ల‌కు వ‌స్తుండ‌డంతో క‌సిగా తీసిన సినిమా హిట్ట‌య్యే ఛాన్సుంటుందేమో చూడాలి.