Begin typing your search above and press return to search.
బాలయ్య పాట.. కోటి రూపాయలు
By: Tupaki Desk | 16 Nov 2015 11:25 AM GMTతెలుగు సినిమా మార్కెట్ పెరుగుతోంది కదా.. బడ్జెట్ విషయంలో అస్సలు తగ్గట్లేదు నిర్మాతలు. ఇంతకుముందు కోటి రూపాయలన్నది చాలా పెద్ద విషయం. ఇప్పుడదది చాలా చిన్నదైపోయింది. పెద్ద సినిమాల్లో ఓ పాటకు, ఓ ఫైటుకి కూడా కోటి రూపాయలు ఖర్చు పెట్టేస్తున్న పరిస్థితి. ‘డిక్టేటర్’ సినిమా కోసం కూడా ఓ పాటకు కోటి రూపాయలు పెట్టేస్తున్నారు నిర్మాతలు.
ప్రస్తుతం డిక్టేటర్ షూటింగ్ హైదరబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. అక్కడ ఓ భారీ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. దీని కోసం ఫిలిం సిటీలో కళ్లు చెదిరే రీతిలో ఓ ఖరీదైన సెట్ వేశారట. ఈ పాటలో బాలయ్యతో పాటు 100 మంది డాన్సర్లు పాల్గొంటున్నారు. ఈ పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుందంటున్నారు.
బాలయ్య కెరీర్లోనే ‘డిక్టేటర్’ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు చెబుతున్నారు. డైరెక్టర్ శ్రీవాస్.. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్మి నిర్మిస్తున్నాడు. కోన వెంకట్ - గోపీమోహన్ లతో పాటు ఇంకో ఇద్దరు రచయితలు కలిసి ‘డిక్టేటర్’ స్క్రిప్టు తయారు చేయడం విశేషం. బాలయ్య సరసన అంజలి - సోనాల్ చౌహాన్ - అక్ష హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఇలియానా ఓ ఐటెం సాంగ్ చేయబోతున్నట్లు సమాచారం.