Begin typing your search above and press return to search.
కోటిన్నర ఆఫీస్ ని 35 లక్షలకే ఎందుకు అమ్మారు! నాగబాబు ప్రశ్న!!
By: Tupaki Desk | 9 Sep 2021 6:32 AM GMTమూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలు అంతకంతకు వేడి పెంచుతున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్ వర్సెస్ మంచు విష్ణు ప్యానల్ హోరాహోరీ మునుముందు పరాకాష్టకు చేరనుంది. ఇప్పటికే గ్రూపు రాజకీయాలతో ఫిలింనగర్ వేడెక్కింది. అక్టోబర్ 10న ఎన్నికల రోజు వరకూ ఇదే పరిస్థితి ఉంటుంది. 950 మంది సభ్యులున్న మా అసోసియేషన్ ఎన్నిక జనరల్ ఎలక్షన్స్ నే తలపిస్తోందంటూ ఇప్పటికే మీడియాల్లో కథనాలు వేడెక్కిపోతున్నాయి.
ఇదిలా ఉంటే పైకి ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు వార్ లా ప్రచారం సాగుతున్నా తెరవెనక ఉండి పెద్ద శక్తులు బాహాబాహీకి దిగుతున్నాయనన బలమైన వాదన వినిపిస్తోంది. ఇది మెగా కాంపౌండ్ వర్సెస్ మంచు అండ్ నందమూరి కాంపౌండ్ వార్ అని కూడా విశ్లేషిస్తున్నారు. ఇక మెగా కాంపౌండ్ నుంచి నేరుగా మెగా బ్రదర్ నాగబాబు ముందుండి కథంతా నడిపిస్తున్నారు. అయితే మంచు కాంపౌండ్ నుంచి మోహన్ బాబు తెరవెనక ఉండి కథ నడిపిస్తున్నారంటూ గుసగుస వేడెక్కిస్తోంది. విష్ణు నేరుగా టీవీ చానెళ్లకు ఎక్కి ప్రత్యర్థులపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే మోహన్ బాబు ఇటీవల అడిగిన ఓ ప్రశ్న హాట్ టాపిక్ గా మారింది.
``అప్పట్లో కొన్న `మా` ఆఫీస్ ఫ్లాట్లను ఎందుకు అమ్మేశారు?`` అన్నదే ఆయన సూటి ప్రశ్న. అయితే దీనిపై తాజాగా నాగబాబు స్పందించారు. అప్పట్లో శ్రీనగర్ కాలనీలో `మా` ఆఫీస్ కోసం రెండు ఫ్లాట్లు కొన్నారు. మా అసోసియేషన్ కి నేను అధ్యక్షుడిగా ఉండగా కొన్నదే. కానీ ఆ తర్వాత పదేళ్లకు శివాజీ రాజా అధ్యక్షుడిగా వీకే నరేష్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఈ ఫ్లాట్లను అమ్మేశారు. అయితే 90లక్షలకు కొన్న ఈ ఫ్లాట్లను కేవలం 35లక్షలకే అమ్మేశారు. ఫ్లాట్లతో పాటు 145 గజాల డివైడెడ్ షేర్ ఉంది. ఇప్పుడు దాని విలువ కోటిన్నర. అంత తక్కువకు ఎందుకు అమ్మేశారు? అన్నది నాటి సెక్రటరీ వీకే నరేష్ నే అడగండి. అతడు మీ ప్యానెల్ కే సపోర్ట్ చేస్తున్నారు కదా! ఆయననే అడగండి సమాధానం. ఇకమీదట దీని గురించి నన్ను ప్రశ్నిస్తే పరిణామాలు సీరియస్ గా ఉంటాయి అంటూ నాగబాబు హెచ్చరించారు.
మొత్తానికి ఎంబీ వర్సెస్ నాగబాబు ఎపిసోడ్ ఇప్పుడు ప్రధానంగా చర్చకు వచ్చింది. అయితే అప్పట్లోనే శ్రీనగర్ కాలనీ పరిసరాల్లో దుర్గంధం వెదజల్లే మురికి కాలవ పక్కన ఈ అపార్ట్ మెంట్లను కొనడం వల్లనే అమ్మేశారని కూడా కథనాలొచ్చాయి. అప్పట్లో 45లక్షలకు కొని 50లక్షలు కేవలం ఆఫీస్ ఇంటీరియర్ కోసం ఖర్చు చేశారు. కానీ తిరిగి 35 లక్షలకు అమ్మేయడంతో 60 లక్షలు నష్టపోయినట్టయ్యింది. అయితే ఖరీదైన ప్రైమ్ ఏరియాలో అపార్ట్ మెంట్లను అంత తక్కువ రేటుకు ఎలా అమ్మేశారన్న ప్రశ్నకు సరైన ఆన్సర్ లేదు.