Begin typing your search above and press return to search.
ప్రభాస్.. ఏందయ్యా ఈ క్రేజు?
By: Tupaki Desk | 23 Feb 2016 5:51 AM GMTఆ మధ్య ఎన్టీఆర్ అట్టర్ ఫ్లాప్ సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’ను యూట్యూబులో పెడితే.. దాన్ని చూడ్డానికి తెగ ఎగబడ్డారు జనం. ఇప్పటిదాకా ఆ సినిమాను యూట్యూబ్ లో 67 లక్షల మందికి పైగా చూశారు. ఇప్పుడు ప్రభాస్ విషయంలోనూ అదే జరుగుతోంది. ప్రభాస్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒక్కటైన ‘రెబల్’ సినిమాను చూడ్డానికి నార్త్ ఇండియన్ ప్రేక్షకులు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. ఏడాది ముందు వరకు హిందీ ప్రేక్షకులకు ప్రభాస్ అంటే ఎవరో తెలియదు. ఐతే ‘బాహుబలి’తో నార్త్ లోనూ సూపర్ పాపులారిటీ సంపాదించాడు యంగ్ రెబల్ స్టార్. దీంతో అతడి పాత సినిమాల్ని వేరే భాషల్లోకి చకచకా అనువదించే ప్రయత్నాల్లో ఉన్నారు నిర్మాతలు.
ఈ నేపథ్యంలోనే ‘రెబల్’ సినిమాను కూడా హిందీలోకి డబ్ చేశారు. దాన్ని యూట్యూబ్ లోనూ పెట్టారు. ఐతే ఈ ఫ్లాప్ సినిమాకు ఇప్పటికే కోటికి పైగా వ్యూస్ రావడం విశేషం. ‘రెబల్’ లాంటి సినిమాను ఇంతమంది చూడ్డం అన్నది నమ్మశక్యం కాని విషయం. మామూలుగా సౌత్ లో రజినీకాంత్ సినిమాలకు మాత్రమే ఇలాంటి రెస్పాన్స్ ఉంటుంది. ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో.. నార్త్ ఇండియన్స్ కూడా అతణ్ని ఎంతగా ఇష్టపడుతున్నారో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? బాహుబలి రెండో పార్ట్ కూడా విడుదలైతే ప్రభాస్ క్రేజ్ ఇంకెంతగా పెరుగుతుందో ఏంటో? ఈ సందడిలో ప్రభాస్ తొలి నాళ్లలో చేసిన సినిమాల్ని కూడా డబ్ చేసి రిలీజ్ చేసేస్తారేమో నిర్మాతలు.