Begin typing your search above and press return to search.
ఏ రోజైనా ఆ ఇద్దరి మధ్య వార్ తధ్యం?
By: Tupaki Desk | 18 July 2022 6:37 AM GMT`బాహుబలి` ప్రాంచైజీ తో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు రాజమౌళి. అటుపై విడుదలైన `ఆర్ ఆర్ ఆర్` సక్సెస్ తో ఆయన పాన్ ఇండియా ఇమేజ్ మరింత రెట్టింపు అయింది. బాహుబలి సక్సెస్ అయినప్పుడే ఎలాగైనా బాలీవుడ్ కి తీసుకెళ్లిపోవాలని కరణ్ జోహార్ సహా కొంత మంది నిర్మాతలు ప్రయత్నించారు.
భారీ పారితోషికం ఆపర్ చేసి రాజమౌళిని తమ స్టార్లతో లాక్ చేయాలని గట్టిగానే ట్రై చేసారు. మిస్టర్ పర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ సైతం రాజమౌళితో సినిమా చేయాలని ఉందన్న కోర్కెను `ధూమ్-3` సమయంలోనే బయట పెట్టారు. అంతగా జక్కన్న బాలీవుడ్ పై ముద్ర వేసారు. మళ్లీ టాలీవుడ్ నుంచి అంతటి ప్రతిభావంతుడు? ఎవరా అని వెలికితీస్తే క్రియేటివ్ మేకర్ సుకుమార్ పేరు చెబుతుంది ఇండస్ర్టీ.
`పుష్ప` సినిమాతో మేకర్ గా పాన్ ఇండియా వైడ్ గుర్తింపు దక్కించుకున్నారు. హిందీ బెల్ట్ లో `పుష్ప` తొలి భాగం వసూళ్లు చూస్తే సుక్కు ప్రతిభకి ఆ వసూళ్లు తార్కాణంగా భావించొచ్చు. ఇక రెండవ భాగం రిలీజ్ అయి సక్సెస్ అయితే గనుక సుకుమార్ రేంజ్ అంతకంతకు పెరిగిపోతుంది. నార్త్ రీజియన్ లో ఇప్పటికే ఆయనకి మంచి పేరు దక్కింది.
ఇటీవలే `లాల్ సింగ్ చద్దా` స్పెషల్ షోకి అమీర్ సుక్కీని సైతం ఆహ్వానించారంటే? ఆయన రేంజ్ ఏ స్థాయికి చేరిందన్నది అద్దం పడుతుంది. ఆ రకంగా రాజమౌళి రేంజ్కి ఏమాత్రం తగ్గని మేకర్ సుకుమార్ అన్నది సుస్పష్టం. ఇంకా చెప్పాలంటే ఇద్దరి మధ్య వ్యత్యాసాన్ని సైతం పోల్చాలి ఇక్కడ. రాజమౌళి వెనుక మంచి టీం ఉంది.
పాన్ ఇండియా కథలు అందించే రైటర్..తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఉన్నారు. ఇద్దరు ఐడియాలిజంతో కథలు రెడీ అవుతుం టాయి. వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి సొంతంగా రాజమౌళి టీమ్ పనిచేస్తుంది. తనయుడు కార్తికేయ తండ్రికి మంచి సపోర్ట్ గా నిలుస్తున్నాడు. కానీ ఇలాంటి టీమ్ సుకుమార్ దగ్గర లేదు. అన్ని తానై చూసుకోవాలి.
ఆయన కథ ఆయనే రాసుకోవాలి. దానికి మెరుగులు ఆయనే దిద్దుకోవాలి. సెట్ లో అవసరమైన మార్పులు..చేర్పులు ఆయనే స్వయంగా చూసుకోవాలి. కేవలం డైలాగుల కోసమే ఇతర రచయితలపై ఆధారపడతారు. తక్కిన సినిమా పనుల్ని సుకుమార్ దగ్గరుండి చూసుకోవాలి. సినిమా ప్రారంభం దగ్గర నుంచి ముగింపు వరకూ ఎంతగా టెన్షన్ పడతారు? అన్నది సుకమార్ చాలాసార్లు రివీల్ చేసారు.
అలా పాన్ ఇండియా మేకర్లు సుకుమార్-రాజమౌళి మధ్య కొంత వ్యత్యాసం ఉంది. మరి ఇలాంటి దిగ్గజాల మధ్య ఏ రోజైనా పోటీ తప్పదా? అంటే తప్పదనే తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరు దర్శకుల్ని ఒకే హీరో అమీర్ ఖాన్ అనుసరిస్తున్నారు. మరికొంత మంది బాలీవుడ్ దిగ్గజాల కళ్లు సుకుమార్ పై ఉన్నాయి. వీళ్లంతా జక్కన్నకి ఇచ్చేంత ప్రాధాన్యత ఇస్తే గనుక రాజమౌళికి పోటీగా సుకుమార్ నిలిచినట్లే. ఆ సన్నివేశం ఏదో ఒక రోజు తప్పక వస్తుందని ఇండస్ర్టీ నుంచి సైతం వినిపిస్తుంది.