Begin typing your search above and press return to search.

ఒక్క హిట్ ప్లీజ్‌.. యంగ్ హీరో ఆశ నెర‌వేరేనా?

By:  Tupaki Desk   |   7 May 2022 11:30 PM GMT
ఒక్క హిట్ ప్లీజ్‌.. యంగ్ హీరో ఆశ నెర‌వేరేనా?
X
కొంత మందికి ప్ర‌య‌త్నం లేకుండానే భారీ విజ‌యాలే వ‌రిస్తుంటాయి. స్టార్ ల‌ని చేస్తుంటాయి. అయితే కొంత మంది ఎంతగా శ్ర‌మించినా.. ఔట్ ఆఫ్ ద బాక్స్ వెళ్లి ప్ర‌యోగాలు చేసినా కాలం క‌ల‌సి రాదు..ఫ‌లితం ల‌భించ‌దు. అంచ‌నాలు త‌ప్పుటుంటాయి. ఏది చేసినా ఎంత శ్ర‌మించినా ఫ‌లితం క‌నిపించ‌దు. గ‌త కొన్నాళ్లుగా ఇదే త‌ర‌హా ప‌రిస్థితిని యంగ్ హీరో నాగ‌శౌర్య ఎదుర్కొంటున్నారు. హిట్టు కోసం ఎంత శ్ర‌మించినా అత‌నికి గ‌త కొన్నేళ్లుగా స‌క్సెస్ అంద‌ని ద్రాక్షే అవుతోంది.

2017లో వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన 'ఛ‌లో' మూవీతో సూప‌ర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన ఈ మూవీ ఆడియో ప‌రంగానూ మ్యూజిక‌ల్ హిట్ గా నిలిచింది. నాగ‌శౌర్య కెర్ కు మంచి ఊపునిచ్చింది. అయితే ఈ సినిమా త‌రువాత ఈ హీరో హిట్టు మాట విని ఏళ్ల‌వుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 'ఛ‌లో' త‌రువాత ఏడు చిత్రాల్లో న‌టించాడు. ఇందులో ఓ ఒక్క మూవీ కూడా త‌న‌కు విజ‌యాన్ని అందించ‌లేదు.

స‌మంత‌తో క‌లిసి 'ఓ బేబీ'లో న‌టించినా ఆ స‌క్సెస్ సామ్ ఖాతాలోకే వెళ్లిపోయింది. దీంతో గ‌త ఏడాది లేడీ డైరెక్ట‌ర్ ల‌క్ష్మీ సౌజ‌న్య‌తో చేసిన ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ 'వ‌రుడు కావ‌లెను' ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేదు. రీతూ వ‌ర్మ హీరోయిన్ గా సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన ఈ చిత్రం నాగ‌శౌర్య‌కు నిరాశ‌నే క‌లిగించింది. ఇక తాజా చిత్రం కోసం ఒళ్లు హూనం చేసుకుని సిక్స్ ప్యాక్ బాడీ, డిఫ‌రెంట్ మేకోవ‌ర్ కోసం క‌ఠోరంగా శ్ర‌మించినా ఫ‌లితం లేకుండా పోయింది.

ధ‌రేంద్ర సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌శౌర్య గ‌తేడాది న‌టించిన స్పోర్ట్స్ డ్రామా 'ల‌క్ష్య‌'. ఈ సినిమాపై శౌర్య భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. ఇందు కోసం అర్చ‌రీలో (విలు విద్య‌లో) ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకున్నారు. డిసెంబ‌ర్ 10న విడుద‌లైన ఈ చిత్రం నాగ‌శౌర్య‌కు తీవ్ర నిరాశ‌ను క‌లిగించింది. దీంతో మ‌ళ్లీ సొంత బ్యాన‌ర్ లో హిట్టు కొట్టాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ప్ర‌స్తుతం నాగ‌శౌర్య త‌న సొంత బ్యాన‌ర్ ఐరా క్రియేష‌న్స్ లో చేస్తున్న మూవీ 'కృష్ణ వ్రింద విహారి'. అనిష్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు.

ఫ‌స్ట్ లుక్ నుంచి సినిమా పై అంచ‌నాలు పెరిగాయి. నాగ‌శౌర్య గెట‌ప్ కూడా కొత్త‌గా వుండ‌టంతో భ‌లే వున్నాడే అని ఫ్యాన్స్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే గ‌త కొన్ని రోజులుగా పెద్ద సినిమాల కార‌ణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదాప‌డుతూ వ‌స్తోంది. ఫైన‌ల్ గా మే 20న రిలీజ్ చేయాల‌ని టీమ్ ఫిక్స‌యింది.

అయితే గ‌త కొతం కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగ‌శౌర్య‌కు ఈ సినిమా అయినా క‌లిసొస్తుందా? అత‌ని ఆశ నెర‌వేరుస్తుందా? అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌రి ఈ యంగ్ హీరో ఆశ‌ని 'కృష్ణ‌వ్రింద విహారి' నెర‌వేస్తుందా? అన్న‌ది తెలియాలంటే మే 20 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.