Begin typing your search above and press return to search.
మరో సూపర్ స్టార్ సినిమాలకు గుడ్ బై..?
By: Tupaki Desk | 13 April 2019 10:34 AM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ చాలా ఏళ్లుగా రాజకీయాల్లోకి రాబోతున్నాడు అంటూ తమిళనాట ప్రచారం జరుగుతోంది. బాబా సినిమా సమయంలోనే రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడు, ఒకటి రెండు సినిమాలు చేసి సినిమాలకు గుడ్ బై చెప్తాడంటూ ప్రచారం జరిగింది. అప్పటి నుండి ఆ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అయ్యింది. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి రజినీకాంత్ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. అందుకే చకచక సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే పేట చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజినీకాంత్ త్వరలో 'దర్బార్' చిత్రంతో రాబోతున్నాడు.
దర్బార్ చిత్రం తర్వాత కేయస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని, వినోద్ అనే దర్శకుడితో మరో సినిమాకు రజినీకాంత్ ఓకే చెప్పాడు. ఈ మూడు చిత్రాల తర్వాత రజినీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తుంది. ఈమూడు సినిమాలు కూడా వచ్చే ఏడాది సమ్మర్ వరకు పూర్తి చేయాలని రజినీకాంత్ ఇప్పటికే దర్శకులకు చెప్పాడని తమిళనాట ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కమల్ హాసన్ రెండు పడవల ప్రయాణం తన వల్ల కావడం లేదని 'ఇండియన్ 2' చిత్రం పూర్తి అయిన వెంటనే సినిమాలకు గుడ్ బై చెప్పేస్తానంటూ ప్రకటించాడు.
ఈ సమయంలోనే రజినీకాంత్ కూడా సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడనే వార్త తమిళ సినీ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్న అభిమానులు ఆయన సినిమాల్లో కూడా కొనసాగాలని కోరుకుంటున్నారు. కాని అలా సాధ్యం కాదని రజినీకాంత్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయమై రజనీకాంత్ నుండి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.