Begin typing your search above and press return to search.
గీత గోవిందంకు భలే ఛాన్సులే!
By: Tupaki Desk | 21 Aug 2018 6:39 AM GMTప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండతో సహా గీత గోవిందం టీమ్ మొత్తం అన్ని మంచి శకునములే తో పాటు భలే ఛాన్సులే లక్కీ ఛాన్సులే పాటలు పదే పదే పాడుకుంటోంది. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు అన్ని తమకు అనుకూలంగా మారడమే. సూపర్ హిట్ టాక్ ఎంత ఉన్నా పోటీగా ఏదైనా కొత్త సినిమా వస్తోంది అంటే దాని ప్రభావం ఎంతో కొంత ఉండే ఖచ్చితంగా ఉండే ప్రస్తుత పరిస్థితుల్లో బ్రేక్ వేస్తాయేమో అనుకున్న సినిమాలు రేస్ నుంచి తప్పుకోవడం కన్నా కావల్సింది ఏముంటుంది. గీత గోవిందంకు అన్ని అలా కలిసొచ్చేస్తున్నాయి. కేవలం ఐదు రోజుల ముందు విడుదలైన శ్రీనివాస కళ్యాణం సూపర్ హిట్ అయ్యుంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ గీత గోవిందంకు ఆ ముప్పు కూడా తప్పిపోవడంతో గేమ్ వన్ సైడ్ కు మారిపోయింది. ఇక ఈ వారం ఓ నాలుగు సినిమాలు వస్తున్నాయి కానీ అవి మరీ గీత గోవిందంని నిలువరించే రేంజ్ వి కాకపోవడంతో యూనిట్ టెన్షన్ పడటం లేదు.
ఇక నిన్న సాయంత్రం నాగ చైతన్య ట్విట్టర్ లో శైలజారెడ్డి అల్లుడు వాయిదా గురించి ట్వీట్ చేయటంతో 31న రావాల్సిన ఆ మూవీ వల్ల గీత గోవిందంకు పెద్ద బ్రేక్ పడుతుందేమో అన్న అంచనా తారుమారైంది. సో ఇక ఆ టైంలో పోటీగా ఇప్పుడున్న సమాచారం మేరకు బరిలో నాగశౌర్య @నర్తనశాల మాత్రమే ఉంటుంది. అది కూడా ఎంటర్ టైన్మెంట్ జానర్ అయినప్పటికీ గీత గోవిందంకు పూర్తిగా బ్రేక్ వేస్తుందని చెప్పలేం. ఒకవేళ బాగుంటే కనక మూడో ఆప్షన్ ఉండదు కాబట్టి ఈ రెండు హ్యాపీగా వసూళ్లు తీసేసుకోవచ్చు. ఇప్పటికే యుఎస్ లో 1.5 మిలియన్ మార్క్ చేరుకున్న గీత గోవిందం తెలుగు రాష్ట్రాల్లో సైతం 30 కోట్లకు పైగా షేర్ రాబట్టి మొదటివారం దాటకుండానే రెట్టింపు పెట్టుబడి వెనక్కు ఇచ్చిన సినిమాగా ట్రెండ్ సెట్ చేసింది. ఈ లెక్కన ఫుల్ రన్ పూర్తయ్యే లోపు 50 కోట్లు దాటడం పెద్ద కష్టమేమి కాదంటునాన్రు ట్రేడ్ విశ్లేషకులు. గీత గోవిందులు అన్నంత పనీ చేసేలా ఉన్నారు.