Begin typing your search above and press return to search.
మరో వారానికి 'జనతా' ఫుల్ సేఫ్
By: Tupaki Desk | 10 Sep 2016 11:30 AM GMTఇకపోతే తొలి వారం (ఒక రోజు ఎక్సట్రా కలుపుకుంటే 8 రోజులు) జనతా గ్యారేజ్ సినిమా బాగానే వసూళ్ళు రాబట్టింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా సినిమాకు ఏకంగా 64.4 కోట్లు షేర్ వసూలైంది. అయితే ఈ కలక్షన్లతో ఇంతకీ పంపిణీదారులు ఒడ్డున పడ్డారా? ఆ ప్రశ్న కనుక మైండ్లో ఉంటే ఇక మర్చిపోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల తరువాత ఎన్టీఆర్ సినిమాను కొన్న వారందరూ సేఫ్ అయిపోతున్నారు. ఇక మీదట వచ్చేవన్నీ లాభాలే.
మన తెలుగు రాష్ట్రంలలో జనతా గ్యారేజ్ సినిమాను ఏకంగా 47.5+ కోట్లు వెచ్చించి కొన్నారు. అయితే తొలి వారం పూర్తయ్యేసరికి.. వీరికి 46.5 కోట్లు 'షేర్' వసూలు అయిపోయింది. ఎట్టాగో బాక్సాఫీస్ దగ్గర జ్యో అచ్యుతానంద సినిమా తప్పిస్తే.. వచ్చే వారం కూడా పోటీనిచ్చే రిలీజనేదే లేదు. నిర్మాలా కాన్వెంట్ ఒక్కటే వచ్చే శుక్రవారం రిలీజవుతోంది. కాబట్టి 23న నాని మజ్ఞూ సినిమా వచ్చేవరకు జనతా గ్యారేజ్ పిండేసుకోవడమే. ఆ లెక్కన చూస్తే పెట్టిన పెట్టబడి రికవర్ అయిపోయి.. తక్కువలో తక్కువ 20 లక్షల పైనే లాభం వస్తుంది. ఇదంతా కేవలం 20 రోజుల స్పాన్ లో జరుగుతున్న విషయం.
ఇకపోతే కర్ణాటకలో 7 కోట్లు.. ఓవర్సీస్ లో 7.25 కోట్లకు సినిమాను కొనగా.. అక్కడ కూడా ఇప్పటికే బాగానే వసూళ్ళొచ్చాయి. కర్ణాటకలో 6.80 కోట్లు షేర్ ఆల్రెడీ వచ్చేయడంతో.. మరో 20 లక్షలు ఈజీగా రికవర్ అవుతుంది అంటున్నారు. అలాగే అమెరికాలో 6.45 కోట్లు వసూలైంది కాబట్టి.. మరో 75 లక్షలు పెద్ద కష్టమేం కాదు. అంటే వచ్చే శుక్రవారంలోపు దాదాపు అన్ని ఏరియాల్లోనూ జనతా గ్యారేజ్ సేఫ్ అయిపోతుందనమాట.