Begin typing your search above and press return to search.
150 థియేటర్లలో.. నెం 1 అనేస్తున్నారు...
By: Tupaki Desk | 18 March 2015 6:14 AM GMTమహేష్-సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 1 నేనొక్కడినే తెలుగునాట ఫ్లాపైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఓవర్సీస్‌లో బాక్సాఫీస్‌ని కొల్లగొట్టింది. అదే కోవలో ప్రధాన నగరాల్లో అనూహ్య విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఆ సినిమాని హిందీలోకి 'నంబర్ 1' పేరుతో అనువదించారు.
ఈ సినిమాని తమిళనాట ఏకంగా 150 థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఎ.ఎన్.బాలాజీ అనే ఆసామి అక్కడ రిలీజ్ చేస్తున్నారు. వాస్తవానికి 1 నేనొక్కడినే చిత్రాన్ని అమీర్‌ఖాన్ హీరోగా రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని అప్పట్లో ప్రచారమైంది. అయితే అది కుదరకపోవడంతో ఇప్పుడు డబ్బింగు రూపంలో రిలీజవుతోంది. అయితే ఓ తెలుగు సినిమా హిందీ డబ్బింగు ఇన్ని భారీ థియేటర్లలో రిలీజవ్వడం చర్చనీయాంశమైంది.
నంబర్ 1 విషయం ఉన్న సినిమా. హాలీవుడ్ ప్రమాణాలతో తెరకెక్కిన సినిమా కాబట్టి హిందీ తెలిసిన తమిళ తంబీల్లో బాగా ఆడుతుందన్న నమ్మకంతోనే భారీగా రిలీజ్ చేస్తున్నారన్నమాట. ఎలాగూ తెలుగు, హిందీ వెర్షన్లు రిలీజవుతున్నాయి కాబట్టి ఇక తమిళ్‌లోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం కుదరదని అర్థమఅవుతోంది.