Begin typing your search above and press return to search.

కామెంట్: టైటిల్ మార్పిడి స్కీమ్

By:  Tupaki Desk   |   26 Jun 2017 10:08 AM GMT
కామెంట్:  టైటిల్ మార్పిడి స్కీమ్
X
ఒక కథకు ఫలానా పేరు అనుకోని కథ మొదలుపెట్టి ఆ సినిమాకు అది సరైనది కాదేమోనని మళ్ళీ మార్చి వేరే టైటిల్ పెట్టడం సినిమాలలో మామూలే. ఒక హీరో కు అనుకున్న టైటిల్ వేరే హీరోకి వెళ్ళడం కూడా మన తెలుగులో చాలానే జరిగాయి. ఇందులో కొన్ని స్నేహపూర్వకంగా మార్చుకోవడం జరిగితే మరికొన్ని వివాదాలతో ముడిపడి ఉన్నవి ఉన్నాయి. ఒకసారి అటువంటి టైటిల్ మార్పిడి చేసుకొన్న సినిమాలు ఏమిటో చూద్దాం.

ఇప్పుడు కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఒక సినిమాకు ‘ఎమ్‌ ఎల్‌ ఏ.. మంచి లక్షణాలున్న అబ్బాయి’ అనే పేరును ఖరారు చేశారు. అసలు ఈ పేరు ఈ సినిమా కన్నా ముందు హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన 'రామయ్యా వస్తావయ్యా' సినిమాకు అనుకున్నారు. చాలావరకు ఈ టైటిల్ నే ఉంచుదాము అనుకున్నారు కాని చివరకు 'రామయ్యా వస్తావయ్యా' అని ఫిక్స్ చేశారు. సినిమా హిట్ కాలేదు కానీ మిగిలిపోయాన టైటిల్ బాగుంది కాబట్టి ఈ ఎమ్‌ ఎల్‌ ఏ.. ని కల్యాణ్ రామ్ వాడుకుంటున్నాడు. అలాగే రామ్ చరణ్ తొలి సినిమా ‘చిరుత’ కూడా ఆ టైటిల్ కాదంట. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ నటించిన ‘కంత్రి’ సినిమా ఉంది కదా ఆ టైటిల్ అనుకున్నాడట పూరి జగన్. మెగా ఫ్యామిలికి ఆ టైటిల్ అంతగా నచ్చకపోవడంతో దాన్ని అలా వాడకుండా ఉంచేశారు. అది అలా ఎన్టీఆర్‌ సినిమా టైటిల్ గా ఉపయోగపడింది. అలాగే మారుతి డైరక్షన్లో వెంకటేష్ హీరోగా ‘రాధ’ అనే రాజకీయ ప్రేమ కథ రావాలిసింది కానీ కథ విషయంలో కొన్ని అవాంతరాలు రావడంతో అది వర్క్ ఔట్ కాలేదు. అది చివరకు శర్వానంద్‌ దగ్గరకు చేరింది.

ఇంకా అల్లు అర్జున్ ‘పరుగు’ సినిమా కు కూడా మొదటి అనుకున్నది పరుగు కాదు ‘వారధి’ అనే టైటిల్ అనుకున్నారు. దాన్నే దాదాపుగా కన్ఫర్మ్‌ చేసుకున్నారు కూడా ఈ సినిమాలో హీరో ప్రేమ వారధి కాస్త పరుగు పెట్టె హీరోగా మారాడు. మరో హిట్ సినిమా అంజలి ప్రధాన పాత్రలో 'గీతాంజలి' టైటిల్ కూడా ముందు అనుకున్న టైటిల్ 'త్రిపుర'. ఈ సినిమాను ముందు పీవీపీ వాళ్లు నిర్మించవలిసి ఉంది. కోన వెంకట్ నిర్మించడంతో ఆ పేరును మార్చి 'గీతాంజలి' గా నిర్మించి విజయం సాధించాడు. మరో స్టార్ హీరో పవన్ కల్యాణ్ సినిమా 'కాటమరాయుడు' టైటిల్ కూడా అతనిది కాదు, కామిడీ నటుడు సప్తగిరి ఒక కామిడీ సినిమాకు అనుకున్నాడు కానీ అతని అభిమాని నటుడు ఆ టైటిల్ అడిగేసరికి కాదు అనలేక ఇచ్చేశాడు సప్తగిరి.

ఇలానే చాలా సినిమా టైటల్స్ తారుమారు అయినాయి. కొన్ని సినిమాలు ప్రొడక్షన్ స్టార్ట్ చేసి పూర్తి చేయలేక మిగిలిపోయాన టైటల్స్ కూడా ఉంటాయి అటువంటి అప్పుడు వేరే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ దాన్ని అడిగి తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కొన్ని వివాదాలు కూడా జరిగాయి అనుకోండి ఉదాహరణకు మహేశ్ బాబు - ఖలేజా, కల్యాణ్‌రామ్‌- కత్తి, హీరో రవితేజ మలయాళీ రీమేక్‌ 'ఆటోగ్రాఫ్‌' లాంటి సినిమాలు వేరే వాళ్ళు అనుకోని మధ్యలో వదిలేసిన టైటిల్లు, మరెవరో రిజిస్టర్‌ చేసుకున్నా టైటల్స్ ను హీరోలు పేరులు అటు ఇటు కొంచెం ట్యాగ్ లైన్లుతో మార్చి వివాదాలతో సొంతం చేసుకున్న టైటల్స్ కూడా ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/