Begin typing your search above and press return to search.

ఇండ‌స్ట్రీలో పెరిగిపోతున్న 'ఒక్క ఛాన్స్' డైరెక్టర్స్...!

By:  Tupaki Desk   |   13 April 2020 1:30 AM GMT
ఇండ‌స్ట్రీలో పెరిగిపోతున్న ఒక్క ఛాన్స్ డైరెక్టర్స్...!
X
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సినిమాకి ఒక కొత్త డైరెక్టర్ పరిచయమవుతున్నాడు. మన టాలీవుడ్ విషయానికొస్తే ఈ సంఖ్య కొంచెం ఎక్కువనే చెప్పాలి. కొత్త తరహా ఆలోచనలతో కొత్త కొత్త సినిమాలను సినీ అభిమానులకు అందిస్తున్నారు. ఒకప్పటి డైరెక్టర్లు ఫిల్మ్ డైరెక్షన్ కోర్సులు చేయకపోయినా అందుబాటులో టెక్నాలజీ ఉపయోగించుకొని గొప్ప గొప్ప కళాఖండాలను టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి అందించారు. కానీ నేటి తరం దర్శకులు మాత్రం అంత ఈజీగా ఇండస్ట్రీలో అడుపెట్టడం లేదు. దేశ విదేశాలలో డైరెక్షన్ కి సంభందించిన కోర్సులు నేర్చుకొని సినీ ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన పెంచుకొనే అడుగుపెడుతున్నారు. కానీ వాళ్లలో కొంతమంది మాత్రమే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నారు. మిగతా వాళ్ళు టాలెంట్ ఉన్నా కనుమరుగైపోతున్నారు. వారు తీసిన మొదటి సినిమానే వారి చివరి సినిమా అయిపోతోంది. ఒకప్పుడు డైరెక్టర్ల పేర్లు చెప్పమంటే వేళ్ళ మీద లెక్కించి చెప్పే వాళ్ళు. కానీ ప్రస్తుత పోటీ ప్రపంచంలో రోజుకొక కొత్త దర్శకుడు ఇంట్రడ్యూస్ అవుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో డైరెక్టర్లు చాలా ఎక్కువైపోయారు. డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆప్ ది షిప్ అంటారు. 24 క్రాఫ్ట్స్ తన అధీనంలో ఉంచుకొని ఒక సినిమాని మన ముందుకు తీసుకొచ్చే వ్యక్తి. ఒకప్పుడు పదుల కొలదీ.. వందల కొలదీ సినిమాలను తీసిన దర్శకులు ఉంటే, ఈ జనరేషన్ లో మాత్రం అలాంటి వాళ్ళు కనిపించడం లేదు.

వాస్తవానికి ప్రస్తుతం టాలీవుడ్ లో వ‌న్ టైమ్ డైరెక్ట‌ర్స్ పెరిగిపోతున్నారని చెప్పవచ్చు. అవును ఇది నూటికి నూరు శాతం నిజం. దీనికి కారణం కూడా లేకపోలేదు. ప్రెజెంట్ తక్కువ క్వాలిటీలో సినిమాలు తీయాల‌నే నిర్మాత‌లు ఎక్కువ అవుతున్నారు. సినిమా మీద ప్యాష‌న్ కంటే.. లాభాలు ఆర్జించాలని పెట్టుబ‌డి పెట్టే వారు ఎక్కువ అవ్వడంతో ఈ 'ఒక్క ఛాన్స్' డైరెక్టర్లు ఎక్కువైపోతున్నారు. ఆ ఒక్క ఛాన్స్ దక్కించుకున్న డైరెక్టర్లు వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటున్నారా అంటే.. లేదనే చెప్పాలి. ప్రస్తుతం మన టాలీవుడ్ లో కంటే పక్క ఇండస్ట్రీలు అయిన త‌మిళ‌ - క‌న్న‌డ‌ - మ‌ళ‌యాలంలో న్యూ టాలెంటెడ్ డైరెక్టర్లు ఇర‌గ‌దీస్తున్నారని చెప్పవచ్చు. ఇది మన వాళ్ళని తక్కువ చేయడం కాదు కానీ గ‌తేడాది మ‌న ద‌గ్గ‌ర ఇంట్రడ్యూస్ అయిన డైరెక్టర్స్ ని ఉదాహరణగా తీసుకుంటే దీన్ని మనం అంగీకరించక తప్పదు.

గ‌తేడాది వ‌చ్చిన ఫస్ట్ టైమ్ డైరెక్ట‌ర్స్ ఎవ‌రూ ఇక్కడ నిల‌బ‌డ‌లేదు.. కానీ అదే మ‌ల‌యాళం త‌మిళంలో మాత్రం అవ‌కాశాల్ని అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్తున్న న్యూ టాలెంట్ ఎక్కువ శాతం ఉన్నారని చెప్పవచ్చు. ఈ కార‌ణంగానే తెలుగు సినిమా హిట్ రేషియో రోజు రోజుకి త‌గ్గిపోతుందని సినీ విశ్లేషకుల అభిప్రాయం. కమర్షియల్ గా సినిమా స‌క్సెస్ అయితే చాలు.. అది ప్రేక్షకుల్ని ఎంట‌ర్ టైన్ చేస్తుందా.. లేదా.. అనే కోణాన్ని ఎప్పుడో మన టాలీవుడ్ మ‌ర్చిపోయింది అన్న‌ది వాస్త‌వం. మాస్ కమర్షియల్ సినిమాలు తప్ప సృజనాత్మకతతో ఎన్ని సినిమాలు వచ్చాయి చెప్పండి. కొంతమంది కొత్త దర్శకులు వేరే ధోరణిలో సినిమాలను తీసిన అవి విజయం సాధించి వారిని డైరెక్టర్లగా నిలబెట్టలేదనే చెప్పవచ్చు. ఏదేమైనా ప్రస్తుతం మన టాలీవుడ్ లో వ‌న్ టైమ్ డైరెక్ట‌ర్స్ ఎక్కువయ్యారనేది అంగీకరించాల్సిన వాస్తవం.