Begin typing your search above and press return to search.
'బింబిసార' డైరెక్టర్ గురించి వైరల్ అవుతున్న ఒక విషయం
By: Tupaki Desk | 3 Aug 2022 12:30 PM GMTనందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా తో ఈనెల 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సినిమా ప్రమోషన్ లో భాగంగా సినిమా ట్రైలర్ ను మరియు విజువల్స్ ను విడుదల చేయడం జరిగింది. ఒక భారీ సినిమా గా విజువల్స్ ను చూస్తుంటే అనిపిస్తున్నాయి. అలాగే విజువల్స్ ను చూస్తూ ఉంటే ఒక కొత్త దర్శకుడు సినిమాను చేసినట్లుగా లేవు అనే టాక్ కూడా వస్తుంది.
ఒక కొత్త దర్శకుడు ఇంత భారీ సినిమాను ప్లాన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దర్శకుడిగా కొత్త వారికి పరిచయం కు చిన్న సినిమాలు.. కొత్త హీరోలు మాత్రమే లభిస్తాయి. కాని బింబిసార దర్శకుడు వశిష్ఠ్ అలియాస్ మల్లిడి వేణు మాత్రం చాలా పెద్ద స్టెప్ వేశాడు. వశిష్ణ మొదటి సినిమానే అయినా కళ్యాణ్ రామ్ నమ్మి సినిమా చేసేందుకు ఓకే చెప్పడం గొప్ప విషయం.
ఇప్పుడు వశిష్ణ్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు వశిష్ణ్ ను వేణు అంటూ ఎన్టీఆర్ సంబోధించడంతో పాటు ఆ తర్వాత ఇంటర్వ్యూల్లో కూడా దర్శకుడి గురించి కళ్యాణ్ రామ్ చాలా ఎక్కువగా మాట్లాడాడు. దాంతో ఇంతకు ఎవరు ఈ వశిష్ఠ్ అనే ఆసక్తి అందరిలో మొదలైంది. అప్పుడే ఈయన గతంలో ఒక హీరో అనే విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రేమలేఖ రాశా అనే సినిమాను కులశేఖర్ దర్శకత్వంలో మల్లిడి వేణు హీరోగా చేయడం జరిగింది. టాలీవుడ్ లో పలు సినిమాలను నిర్మించిన మల్లిడి సత్యనారాయణ కొడుకు ఈ మల్లిడి వేణు. నిర్మాత తనయుడు అవ్వడం వల్ల హీరోగా ఎంట్రీ లభించింది... కాని హీరోగా తను సెటిల్ అవ్వడం కష్టం.. హీరో పాత్రలకు తాను సెట్ అవ్వను అని తనకు తాను గా ఆయన భావించి డైరెక్షన్ వైపు వెళ్లినట్లుగా తెలుస్తోంది.
దర్శకత్వంపై ఆసక్తిగా చాలా సంవత్సరాలుగా ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి.. సొంతం గా కథలు రాసుకున్న ఈయన నాలుగు అయిదు సంవత్సరాల క్రితమే దర్శకుడిగా పరిచయం అవ్వాల్సి ఉన్నా ఏవో కారణాల వల్ల కొందరు హీరోలు కథ నచ్చి ఆ తర్వాత ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకు వెళ్లలేదు.
ఎట్టకేలకు కళ్యాణ్ రామ్ తో కలిసి బింబిసార సినిమా ను తెరకెక్కించి.. వశిష్ఠ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హీరోగా సక్సెస్ అవ్వలేక పోయిన వశిష్ఠ్ ఎంత వరకు దర్శకుడిగా తన కెరీర్ ను ఈ సినిమా తో నిలబెట్టుకుంటాడు అనేది చూడాలి.