Begin typing your search above and press return to search.
ఖలేజా..పులి ప్రొడ్యూసర్ కు ఏడాది జైలు
By: Tupaki Desk | 2 April 2016 5:00 AM GMTటాప్ హీరోలతో సినిమాలు తీసి అప్పట్లో హాట్ ప్రొడ్యూసర్ గా పేరున్న శింగమనల రమేష్ తాజాగా వార్తల్లోకి వచ్చారు. ఒక చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలుశిక్ష ఆయనకు వేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
శింగనమల పేరు చెప్పిన వెంటనే ఆయన తీసిన.. ‘మా అన్నయ్య’.. ‘వీడే’.. ‘జానకీ వెడ్స్ శ్రీరామ్’.. ‘ఖలేజా’.. ‘కొమరం పులి’ లాంటి సినిమాలు చటుక్కున గుర్తుకు వస్తాయి. అలాంటి ఆయన తాజాగా కర్నూలు కోర్టులో ఏడాది జైలుశిక్షకు గురయ్యారు. కర్నూలు జిల్లా బనగానపల్లెకు చెందిన రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి శింగనమల మీద కేసు వేశారు. చెక్ బౌన్స్ కు సంబంధించి రెండు కేసులపై విచారణ జరిపిన కర్నూలు కోర్టు ఆయన్ను దోషిగా నిర్దారించింది. ఈ కేసులకు సంబంధించి ఆయనకు ఏడాది జైలుశిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించింది.