Begin typing your search above and press return to search.

ఇంద్ర‌జ కోస‌మేనా ఈ ఎదురు చూపులు?

By:  Tupaki Desk   |   24 Feb 2019 10:17 AM GMT
ఇంద్ర‌జ కోస‌మేనా ఈ ఎదురు చూపులు?
X
ఆ క‌ను రెప్ప‌ల స‌వ్వ‌డికే మ‌న‌సు మూగవోయింది. ఆ అతిలోక సుంద‌రి రూపం హృద‌యంలొ ఏనాడో కొలువైంది. ప్ర‌తిక్ష‌ణం ఆ స‌వ్వ‌డికోస‌మే ప్రేక్ష‌కుడి మ‌న‌సు ఆరాట‌ప‌డింది. మోములో ఆ అమాయ‌క‌త్వం .. సుకుమార‌మైన లాలిత్యం ప్రేక్ష‌కుడి గుండెని ద‌శాబ్ధాల పాటు అలా అంటి పెట్టుకునే ఉన్నాయి. ఆమె ఉన్నారా.. లేరా? అన్న‌ది ఎవ‌రికీ గుర్తు లేదు. ఆ అద్భుత‌ న‌ట‌న‌.. మ‌హ‌దాద్భుత‌మైన హావ‌భావాలు మాత్ర‌మే క‌ళ్ల ముందు మెదులుతూ ఉంటాయి. ఆమె లేదు అన్న మాట ఎప్ప‌టికి జీర్ణం కాదు అభిమానుల‌కు. భూలోకానికి దిగి వ‌చ్చిన ఇంద్ర‌జ వెళ్లిపోయింది అన్న సంగ‌తే ఇంకా ఎవ‌రి మ‌న‌సుల్లోనూ రిజిస్ట‌ర్ కాలేదు. ఇంత‌లోగానే తాను అంత‌ర్ధాన‌మై ఏడాది పూర్త‌యింద‌న్న మాట విన‌లేనిది.

ఎక్క‌డో స్వ‌ర్గ‌లోకంలో దేవేంద్రుని కుమార్తె పూల‌వ‌నంలో విహ‌రిస్తూ సేద తీరుతోందేమో. అక్క‌డి నుంచే భూలోకంలో ఏం జ‌రుగుతోందో ప‌రిశీలిస్తోందేమో. ఏదో ఒక‌టి జ‌ర‌గ‌నీ! .. త‌న‌ని త‌ల‌వ‌ని రోజే లేదు. త‌న‌కోసం మూగ‌గా రోధించ‌ని సాయంత్ర‌మే లేదు. ఏదో ఒక విల‌యం త‌ర్వాత అన్నీ కోల్పోయిన ఆవేద‌న మాత్ర‌మే మిగిలి ఉంది. శ్రీ‌దేవి తిరిగి భువిపై జ‌న్మించే వీలుందా? మ‌రోసారి శ్రీ‌దేవిని చూసే ఛాన్సుందా? అన్న‌ది సందేహ‌మే. ప్ర‌స్తుతానికి అభిమానులు జాన్వీలోనే శ్రీ‌దేవిని చూసుకునేందుకు అల‌వాటు ప‌డ్డారు.

నేటి త‌రం న‌టీమ‌ణుల్లో దాగి ఉన్న ప్ర‌తిభ‌.. క‌ళాత్మ‌క‌త రూపంలో శ్రీ‌దేవి జీవించే ఉందని అభిమానులు స‌రిపెట్టుకోవాలి. మామ్‌ శ్రీ‌దేవి లేని ఈ లోకంలో ఆర్జీవీ లాంటి వీరాభిమానులు మాత్రం మందు గ్లాసులో వోడ్కా ఒంపుకుని వేచి చూస్తేనే ఇబ్బంది. అందుకే ప్ర‌తి వ‌ర్ధంతికి త‌న‌కోసం ప్ర‌త్యేకించి సంస్మ‌ర‌ణ‌లు చేస్తూ త‌న సినిమాల్ని టీవీల్లో చూస్తూ గ‌డిపేస్తున్నారు. ఎంద‌రో న‌టీమ‌ణుల్లో స్ఫూర్తి నింపిన అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి తొలి జ‌యంతి సందర్భ ంగా ఈ ప్ర‌త్యేకం...