Begin typing your search above and press return to search.
ఒకరి కథ.. మరొకరి తలరాత!
By: Tupaki Desk | 6 April 2022 11:30 PM GMTమనమొకటి తలిస్తే దైవమొకటి తలిచాడు అంటుంటాం. ఇక్కడ దైవం అంటే విధి. విధి అనుకున్నదే చాలా మంది జీవితాల్లో జరుగుతూ వుంటుంది. అలా తలవనిది జరిగి కొంత మంది తలరాతని మార్చిన సందర్భాలు చాలానే వున్నాయి. సినిమాల విషయంలో అయితే మన హీరోలు ఒకటి తలస్తే విధి మరొకటి తలచి వారి జీవితాల్ని.. తలరాతల్ని మార్చిన సందర్భాలు ఎన్నో వున్నాయి. తమని వెతుక్కుంటూ వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ లని అనుమానంతో తిరస్కరించిన హీరోలు వున్నారు. అలా తిరస్కరించిన కథలతో తమ తలరాతల్ని మార్చుకుని స్టార్ లుగా ఎదిగిన వాళ్లూ వున్నారు.
ఒకరి కథ... మరొకరి తలరాతని ఎలా మార్చిందో ..టాలీవుడ్ లో జరిగిన ఆ చిత్రాలు ఏంటో ఒకసారి చూద్దాం. టాలీవుడ్ లో చిరంజీవిని 'సుప్రీమ్ హీరో'గా నిలబెట్టిన 'ఖైదీ' చిత్రం నుంచి ఈ తంతు నడుస్తూనే వుంది. ముందు ఈ కథని సూపర్ స్టార్ కృష్ణ దగ్గరికి తీసుకెళ్లారు దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డి, నిర్మాతలు. అయితే అప్పటికే పలు చిత్రాల్లో నటిస్తూ క్షణం తీరికలేని బిజీలో వున్న కృష్ణ ఆ కథని తాను చేయలేనని, కొత్తగా వచ్చిన చిరంజీవి కి ఈ కథని వినిపించి అతన్ని ఈ ప్రాజెక్ట్ కు తీసుకోమని చెప్పారట.
అలా 'ఖైదీ' సూపర్ స్టార్ కృష్ణ నుంచి చేతులు మారి చిరంజీవి కి చేరింది.. అదే అప్పట్లో ఆయనని 'సుప్రీమ్ హీరో'ని చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే అప్పట్లో చేతులు మారి మరొకరికి స్టార్ డమ్‌ని వారి తలరాతనీ మార్చిన సినిమాలు చాలానే వున్నాయి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి మార్పిడి జరుగుతూనే వుంది. పాథ్ బ్రేకింగ్ బ్లాక్ బస్టర్ గా, టాలీవుడ్ గేమ్ ఛేంజర్ గా నిలిచిన 'అర్జున్ రెడ్డి' ముందు అల్లు అర్జున్, శర్వానంద్ ల వద్దకు వెళ్లింది. మరీ క్యారెక్టర్ 'రా'గా వుందని చేయడానికి బన్నీ, శర్వా కాస్త భయపడ్డారు. దాంతో ఈ కథ విజయ్ దేవరకొండ వద్దకు వెళ్లి అతన్ని క్రేజీ స్టార్ గా నిలబెట్టింది.
ఇక గత ఏడాది డిసెంబర్ లో విడుదలై నార్త్ లో కలెక్షన్ ల వర్షం కురిపించిన 'పుష్ప' బన్నీ చేయాల్సింది కాదు. ముందు ఈ కథని సూపర్ స్టార్ మహేష్ బాబు తో సుకుమార్ చేయాలనుకున్నారట. అయితే క్యారెక్టర్ మరీ మాసీవ్‌గా వుండటం, లుంగీలో మాసిన బట్టల్లో రఫ్ గా కనిపించాల్సి రావడం, ఊర మాస్ డైలాగ్ లు, మాసిన గడ్డం.. ఇలా తను నటిస్తే ఫ్యాన్స్, ప్రేక్షకులు ఒప్పుకుంటారా? అని అనుమానించిన మహేష్ నేను చేయలేనని, మరో హీరోతో ట్రై చేసుకోమని తప్పుకున్నారట.
అదే బన్నీని ఇప్పుడు దేశ వ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. 300 కోట్ల పైచిలుకు వసూళ్లని రాబట్టగల హీరోగా నిలబెట్టింది. ఇక సూపర్ స్టార్ మహేష్ తో పూరి జగన్నాథ్ చేయాలనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ 'జన గణ మన' చివరికి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేతికి వెళ్లి ఇటీవలే సెట్స్ పైకి కూడా వెళ్లిన విషయం తెలిసిందే. మహేష్ తో పాటు పవన్ తో అయినా ఈ మూవీని పట్టాలెక్కించాలని పూరి విశ్వప్రయత్నాలు చేశాడు కానీ చివరికి విజయ్ దేవరకొండ ఆయన డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.
ఇక ఇలాగే చేతులు మారి మరో హీరో తో సెట్స్ పైకి వెళ్లిన సినిమాలు చాలానే వున్నాయి. ఇటీవల లాంఛనంగా మొదలైన 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ ముందు మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లిందట. ఆయన చేయడానికి ఆసక్తి చూపించకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ఇప్పడు రవితేజ కు చేరింది. వంశీ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక విక్టరీ వెంకటేష్ తో త్రినాధరావు నక్కిన చేయాలనుకున్న 'ధమాకా' చివరికి మాస్ మహారాజా రవితేజ చేతికి వెళ్లింది.
అలాగే హీరోల సినిమాలే కాదు హీరోయిన్ ల సినిమాలు కూడా చేతులు మారాయి. సందీప్ రెడ్డి వంగ చేస్తున్న 'యానిమల్' చిత్రంలో ముందు పరిణీతి చోప్రా అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా ఆ స్థానంలో రష్మిక మందన్నని ఫైనల్ చేశారు. ఇక నాగార్జున నటిస్తున్న 'ఘోస్ట్' చిత్రంలో ముందు హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని అనుకున్నారు. కానీ చివరికి తను పెగ్నెంట్ కావడంతో ఆ స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ ని తీసుకున్నారు.