Begin typing your search above and press return to search.

2% చూస్తే నేర‌మా? 100% సాధ్య‌మా?

By:  Tupaki Desk   |   20 Nov 2015 10:30 PM GMT
2% చూస్తే నేర‌మా? 100% సాధ్య‌మా?
X
కండ‌ల‌హీరో స‌ల్మాన్‌ ఖాన్ హీరోగా క‌బీర్‌ ఖాన్ తెర‌కెక్కించిన భ‌జ‌రంగి భాయిజాన్ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సృష్టించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 600 కోట్లు పైగా వ‌సూలు చేసింది. అందులో 300 కోట్ల షేర్ వ‌సూళ్లు ద‌క్కాయి. అయితే ఈ మొత్తం వ‌చ్చింది కేవ‌లం దేశంలోని 2 శాతం జ‌నం చూడ‌డం వ‌ల్లే అంటూ ప్ర‌చారం సాగుతోంది. మిగ‌తా 98 శాతం జ‌నాలు థియేట‌ర్ల‌కు ఎందుకు రావ‌డం లేదు అంటూ ఓ సిల్లీ క్వ‌శ్చ‌న్ రెయిజ్ చేస్తున్నారు. అయితే ఇదో పిచ్చి ప్ర‌శ్న‌గా కొట్టి పారేస్తున్నారు విశ్లేష‌కులు.

ప్ర‌తి 100 మందిలో కేవ‌లం ఇద్ద‌రే సినిమా థియేట‌ర్ల‌కు వ‌చ్చారు అంటే ఆర్థిక ప‌రిస్థితి కూడా ఆ ఇద్ద‌రికే స‌హక‌రిస్తోంద‌ని అర్థం చేసుకోవాలి. సినిమాలు చూడాల‌న్న గుల ఎవ‌రికి ఉండ‌దు? థియేట‌ర్ల వ‌ర‌కూ ఫ్యామిలీ స‌మేతంగా వ‌చ్చి నెల జీతం మొత్తం ఒకే సినిమా కోసం స‌మ‌ర్పించుకునేందుకు ఎవ‌రూ సిద్ధంగా ఉండ‌రు. అయినా దేశంలో ప్ర‌జ‌ల గురించి మీకేం తెలుసు గురూ? క‌నీస వ‌స‌తులైనా లేని దుర్భేద్య‌మైన ప్ర‌జ‌ల గురించి మీకేం తెలుసు. ఇప్ప‌టికీ దేశంలో ఆడాళ్లు బ‌హిర్భూమికి వెళ్లి రావాల్సిన ప‌రిస్థితి. టాయ్‌ లెట్లు ఉండ‌వు, లిట్రిన్ ఫెసిలిటీ ఉండ‌దు. మినిమం బ‌తికే ఏర్పాట్లు కూడా మ‌న ప్ర‌భుత్వాలు చేయ‌లేదు. అలాంట‌ప్పుడు ఖ‌రీదైన‌ - విలాస‌వంత‌మైన జీవితం అంద‌రినుంచి ఆశించ‌డం త‌ప్పు.

ప్ర‌తి ఒక్క‌రూ థియేట‌ర్‌ కి వ‌చ్చి సినిమా చూడాలంటే చాలా క‌ష్టం. ఇదంతా అన‌వ‌స‌ర ఆర్భాటం. కార్పొరెట్ లెక్క‌ల‌న్నీ కాకి లెక్క‌లు. వాస్త‌వాల్ని విశ్లేషించ‌లేని వాజ‌మ్మ ప‌ద్ధులు ఇవ‌న్నీ. అర్థ‌మైందా ఇప్పుడైనా?