Begin typing your search above and press return to search.

సుశాంత్ మృతి వెన‌కున్న కుట్ర‌ను సీబీఐ మాత్ర‌మే ఛేదిస్తుంది!

By:  Tupaki Desk   |   27 Dec 2022 7:13 AM GMT
సుశాంత్ మృతి వెన‌కున్న కుట్ర‌ను సీబీఐ మాత్ర‌మే ఛేదిస్తుంది!
X
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆక‌స్మిక మృతికి, టాలీవుడ్ హీరో ఉద‌య్ కిర‌ణ్ ఆత్మ హ‌త్య‌కు ద‌గ్గ‌రి సంబంధాలే వున్నాయ‌నిపిస్తోంది. ఉద‌య్ కిర‌ణ్ ఇండస్ట్రీలో త‌న‌ని ఓ బ‌ల‌మైన కార‌ణం చేత‌.. బ‌ల‌మైన వ్య‌క్తుల కార‌ణంగా ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ప‌క్క‌న పెట్టాయ‌ని, అది భ‌రించ‌లేకే ఉద‌య్ కిర‌ణ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని ఇంత వ‌ర‌కు వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తూనే వున్నాయి. ఇప్ప‌టికీ అత‌ని ఆత్మ హ‌త్య వెన‌కున్న అస‌లు ర‌హ‌స్యం ఏంటో బ‌య‌ట‌ప‌డ‌లేదు.

ఇదిలా వుంటే ఇదే త‌ర‌హాలో కాక‌పోయినా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆక‌స్మికంగా మృతి చెంద‌డం దేశ వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లాన్ని సృష్టించింది. త‌ను ఆత్మ హ‌త్య చేసుకున్నాడ‌ని, అందుకు ఇండ‌స్ట్రీలో వున్న నెపోటిజ‌మ్ కార‌ణ‌మంటూ ఆయ‌న అభిమానులు క‌ర‌ణ్ జోహార్, మ‌హేష్ భ‌ట్ లాంటి ద‌ర్శ‌కుల‌ని ట్రోల్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే ఇప్ప‌టికీ అత‌ని మ‌ర‌ణం ఓ ర‌హ‌స్యంగానే వుండిపోయింది. దీనిపై ప్ర‌స్తుతం సీబీఐ ఎంక్వైరీ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

ఉద‌య్ కిర‌ణ్ మంచి న‌టుడు, క్రేజీ హీరో, కారీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాత్రం అంత‌కు మించిన న‌టుడు, అంత‌కు మించిన పాపులారీటీ త‌న సొంతం. ఎదుక‌రుగున్న క్ర‌మంలో హ‌ఠాత్తుగా మృతి చెంద‌డం.. అత‌ని మృతి మిస్ట‌రీగా మార‌డం ప‌లువురిని ఇప్ప‌టికీ ఆవేద‌న‌కు గురిచేస్తోంది. రీసెంట్ గా సుశాంత్ మృతిపై పోస్ట్ మార్టమ్ లో పాల్గొన్న వ్య‌క్తి త‌న‌ది ముమ్మాట‌కి హ‌త్యేన‌ని వెల్ల‌డించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఇక ఉద‌య్ కిర‌ణ్ మృతిపై ద‌ర్శ‌కుడు తేజ ఇటీవ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను చ‌నిపోయే సంద‌ర్భంలో ఉద‌య్ కిర‌ణ్ మృతివెన‌కున్న ర‌హ‌స్యాన్ని చెబుతాన‌ని తేల్చేయ‌డం తెలిసిందే. ఇలా సుశాంత్ మృతి వెన‌కున్న ర‌హ‌స్యాలున్నాయ‌ని కొంత మంది ప్ర‌క‌టించడం.. అదే త‌ర‌హాలో కు ఉద‌య్ కిర‌ణ్ ల మృతి వెన‌క ర‌హ్యం వుంద‌ని తేజ చెప్ప‌డం ఇరువుని మృతికి ద‌గ్గ‌రి సంబంధాన్ని తెలియ‌జేస్తోంది.

ఇదిలా వుంటే సుశాంత్ ని పోస్ట్ మార్ట‌మ్ చేసిన టీమ్ లో వున్న వ్య‌క్తి అత‌నికి హ‌త్యేన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో సుశాంత్ లాయ‌ర్ వికాస్ సింగ్‌ తాజాగా స్పందించారు. తాజా ప‌రిణామాల గురించి త‌న‌కు ప్ర‌త్య‌క్ష స‌మాచారం లేద‌ని, అత‌ని సోద‌రీమ‌ణులు ఈ విష‌యం గురించి నాకు చెప్ప‌లేద‌ని, అందు వ‌ల్ల నేను దాని గురించి స్పందించ‌లేన‌న్నారు.

అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణం వెన‌కున్న కుట్ర ఉన్నందున అది సాధార‌ణ ఆత్మ‌హ‌త్య కాద‌ని నేను స‌మ‌ర్థిస్తాను. ఆయ‌న మ‌ర‌ణం వవెన‌కున్న కుట్ర‌ను సీబీఐ మాత్ర‌మే ఛేదించ‌గ‌ల‌దు' అని తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.