Begin typing your search above and press return to search.
'బంగార్రాజు' కోసమే.. ఏపీలో నైట్ కర్ఫ్యూ మారిందా?
By: Tupaki Desk | 12 Jan 2022 5:30 AM GMTరాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. నచ్చిన వారు ఉంటే.. ఒకలా.. నచ్చనివారు ఉంటే మరోలా.. వ్యవహరించే నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఇదే మాట.. నెటిజన్ల నుంచి కూడా వినిపిస్తోంది. ఏపీలో మంగళవారం రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ అమలు కావాల్సి ఉంది. కరోనా కొత్త వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనూహ్యంగా నైట్ కర్ఫ్యూకు రంగం సిద్ధం చేసింది. మంగళవారం నుంచి కఠినంగా అమలు చేస్తామని ప్రకటించింది. అయితే.. ఇంతలోనే తననిర్ణయాన్ని సంక్రాంతి తర్వాతకు అని మార్పు చేసింది. మరి దీని వెనుక రీజనేంటి? అంటే.. నెటిజన్ల వాదన మరో విధంగా ఉంది.
సోమవారం జరిగిన వైద్య శాఖ అధికారుల సమీక్షలో సీఎం జగన్ స్వయంగా నైట్ కర్ఫ్యూపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి మంగళవారం ఉదయమే జీవో జారీ చేశారు. దీని ప్రకారం.. సినిమా హాళ్లలో 50 శాతం ఆక్యుపెన్సీకే అనుమతించారు. అదేవిధంగా మాస్కులు కంపల్సరీ చేశారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ ఉంటుందని చెప్పారు. అయితే.. జీవో విడుదలైన కొన్ని గంటల్లోనే సర్కారు తన నిర్ణయాన్ని మార్చుకుంది. జీవోలో మార్పులు చేసింది. దీనికి సంబంధించి వైద్య శాఖమంత్రి ఆళ్లనాని మీడియాతో మాట్లాడుతూ.. సంక్రాంతి తర్వాతే.. నైట్ కర్ఫ్యూ ఉంటుందని.. ఆంక్షలు కూడా సడలిస్తున్నట్టు చెప్పారు.
రాత్రి కర్ఫ్యూ కారణంగా.. ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే భావనతో నే ఇలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సంక్రాంతి సమయంలో వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చేవారు పెరుగుతున్నారని.. అందుకే నిర్ణయం మార్చుకున్నామన్నారు. సంక్రాంతి పండుగ వేళ పల్లెలకు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారని.. వారికి ఇబ్బందులు కలగకూడదనే కర్ఫ్యూ వాయిదా వేశామని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. మూడోదశ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించాలన్న ఆయన.. మాస్కులు ధరించకపోతే రూ.100 జరిమానా విధిస్తామని చెప్పారు. కరోనా కట్టడిలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
వాణిజ్య దుకాణాలు, మాల్స్ తదితర వాటిల్లో కొవిడ్ నిబంధనలు పాటించకపోతే రూ.10 వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశించింది. సినిమా హాళ్లలో 50 శాతం మందికే అనుమతించింది. ఆర్టీసీ సహా ప్రజా రవాణా వాహనాల్లో సిబ్బంది, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే.. ఏపీ సర్కారు కర్ఫ్యూ వాయిదాపై నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. సంక్రాంతికి అక్కినేని నాగార్జున తన తనయుడు కలిసి నటించిన చిత్రం బంగార్రాజు విడుదల అవుతోందని.. అందుకే ఇలా చేసి ఉంటారని అంటున్నారు. సీఎం జగన్‌తో బంగార్రాజు కు ఉన్న అవినాభావ సంబంధాల నేపథ్యంలో ఆయన సినిమాకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉంటారని అంటున్నారు. నాగార్జున ఫ్రెండ్.. నిర్మాత నిరంజన్ రెడ్డి.. సీఎం జగన్‌తో సోమవారం భేటీ అయి.. నైట్ కర్ఫ్యూ నిర్ణయంపై చర్చించారని.. నైట్ కర్ఫ్యూ... 50 శాతం ఆక్యుపెన్సీ కారణంగా.. నష్టాలు వస్తాయని.. వివరించి ఉంటారని అంటున్నారు. అందుకే ప్రభుత్వం నిర్ణయం మార్చుకుందని చెబుతున్నారు.
``పండగల సమయాల్లో ప్రజలు సినిమాలకు ఎక్కువగా వస్తారు. ముఖ్యంగా రాత్రి పూట సినిమా హాళ్లకు వచ్చేవారు ఎక్కువగా ఉంటారు. నైట్ కర్ఫ్యూ పెడితే.. సెకండ్ షో పై తీవ్ర ప్రభావం పడుతుంది. అదేవిధంగా ఫస్ట్ షో కలెక్షన్లపైనా ప్రభావం పడుతుంది`` అని నిరంజన్ రెడ్డి సీఎం జగన్‌కు వివరించి ఉంటారని సమాచారం. ఈ క్రమంలోనే నాలుగైదు రోజుల పాటు ప్రభుత్వం.. కర్ఫ్యూను వాయిదా వేసుకుని ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా.. బంగార్రాజుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు.