Begin typing your search above and press return to search.
ఇప్పట్లో ఐదు ఆటలు లేనట్లే.. నాలుగు ఆటలే వేస్తారు
By: Tupaki Desk | 31 July 2021 3:32 AM GMTసెకండ్ వేవ్ ముగిసి.. మూడో వేవ్ ఉంటుందా? లేదా? అన్న సందేహాల మధ్య.. ప్రభుత్వం పచ్చ జెండా ఊపిని ఇన్నాళ్లకు తెలంగాణలో థియేటర్లు ఓపెన్ కాగా.. ఏపీలో మాత్రం కొన్ని థియేటర్లు మాత్రమే రీఓపెన్ కావటం తెలిసిందే. సామాన్యుడి వినోదంగా చెప్పే ‘సినిమా’ను చూసేందుకు ఎన్ని మాథ్యమాలు ఉన్నప్పటికి.. అంత పెద్ద సిల్వర్ స్క్రీన్ మీద చూస్తే ఆ ఫీలే వేరుగా ఉంటుంది. ఇంట్లో టీవీలో బ్యాక్ టు బ్యాక్ సినిమా చూసినప్పుడు వచ్చే ఫీల్ తో పోలిస్తే.. థియేటర్లో సినిమాను నలుగురితోకలిసి చూసినప్పుడు కలిగే భావోద్వేగం వేరుగా ఉంటుంది.
ఇప్పటికే ఇంట్లోనూ.. మొబైల్ లోనూ.. ల్యాప్ టాప్.. సిస్టంలలో సినిమాలు చేసేస్తున్న ప్రజలకు థియేటర్లలో చూసే అవకాశం కలిగింది. అయితే.. ఇప్పటికి కరోనా భయం వెంటాడుతున్న వేళ.. తాజాగా సినిమా థియేటర్లకు గతంలో మాదిరి వస్తారా? రారా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఇలాంటివేళ.. తెరిచిన థియేటర్లు చాలా జాగ్రత్తగా రన్ చేస్తున్నాయి.
కరోనాకు ముందు వరకు చాలా మల్టీప్లెక్సుల్లో ఉదయం 10 గంటలకే షో మొదలయ్యేది. సింగిల్ థియేటర్లలో మాత్రం ఉదయం 11 - 12 గంటల మధ్య మొదటి ఆట పడేది. మల్టీఫ్లెక్సుల్లో ఒక్కో థియేటర్ కనీసం ఐదు షోలు వేసేలా ప్లాన్ చేస్తే.. మామూలు థియేటర్లు మాత్రం నాలుగు షోలకే పరిమితమయ్యేది. ఏదైనా క్రేజీ నటుడి సినిమా విడుదల సందర్భంలో మాత్రం థియేటర్లు ఐదు.. మల్టీఫ్లెక్సులు ఆరు సినిమాలు వేసేందుకు ప్లాన్లు వేసే వారు. అలాంటిది తాజాగా మాత్రం అందరూనాలుగు షోలకు మాత్రమే పరిమితమవుతున్నారు.
మామూలు థియేటర్లతో పోలిస్తే.. గంట ఆలస్యంగా మధ్యాహ్నాం ఒంటి గంట తర్వాతే మల్టీఫ్లెక్సులు ఓపెన్ చేస్తున్నారు. ఎందుకంటే సింగిల్ థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులకు.. మల్టీఫ్లెక్సులకు వెళ్లే ప్రేక్షకుల మైండ్ సెట్ కు కాస్తంత తేడా ఉంటుందని చెబుతున్నారు. దీనికి తోడు తాజాగా విడుదలైన సినిమాల్లో తిమ్మరసు.. ఇష్క్ మూవీలు పెద్ద సినిమాలు కాకపోవటం.. వాటి హీరోలకు ఉన్న ఇమేజ్.. ప్రేక్షకుల్లో భయాన్ని పక్కన పెట్టి ఉత్సాహంగా థియేటర్లకు వచ్చేంత సీన్ లేకపోవటంతో.. థియేటర్.. మల్టీఫ్లెక్సుల యజమానులు ఆచితూచి అన్నట్లుగా షోలు వేస్తున్నారు.
ఎవరైనా పెద్ద హీరో సినిమా కానీ.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న సినిమా విడుదలైతే తప్పించి..ఇప్పుడున్న స్తబ్దత మొత్తం పోదంటున్నారు. అప్పటి నుంచి మాత్రమే మల్టీఫ్లెక్సులు జోరుగా సాగే అవకాశం ఉందంటున్నారు. ఆ రోజు మరెప్పుడన్న మాట పలువురు ప్రేక్షకుల నోటి నుంచి వినిపిస్తోంది. మల్టీఫ్లెక్సుల్లో నాలుగు షోలకు బదులుగా.. ఐదు షోలు వేస్తే అయ్యే ఖర్చు లెక్కలు వేరుంటాయని.. అందుకే నాలుగు షోలకు పరిమితమవుతున్నట్లు చెబుతున్నారు.