Begin typing your search above and press return to search.
అలా వుంటేనే భద్రత : రకుల్ ప్రీత్ సింగ్
By: Tupaki Desk | 24 Feb 2023 9:00 AM GMTప్రభాస్ కజిన్ హీరోగా పరిచయమైన 'కెరటం'సినిమాతో టాలీవుడ్ లోకి ప్రవేశించింది ఢిల్లీ సోయగం రకుల్ ప్రీత్ సింగ్. ముందు 'గిల్లీ' అనే కన్నడ మూవీతో నటిగా ప్రయాణం మొదలు పెట్టినా తనకు టాలీవుడ్ ద్వారానే హీరోయిన్ గా గుర్తింపు లభించింది. అయితే రకుల్ కు హీరోయిన్ గా మంచి పేరుతో పాటు ఆఫర్లని అందించిన మూవీ 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'. సందీప్ కిషన్ నటించిన ఈ మూవీ రకుల్ కు టాలీవుడ్ లో టాప్ స్టార్లతో నటించే అవకాశాన్ని అందించింది.
ఒకే ఏడాది ముగ్గురు టాప్ స్టార్లు రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో వరుసగా సినిమాలు చేసి రికార్డు సాధించింది. తెలుగులో సందీప్ కిషన్ నుంచి టాప్ స్టార్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వరకు అందరితో కలిసి నటించిన రకుల్ ఫైనల్ గా మహేష్ తో కలిసి నటించిన 'స్పైడర్' మూవీతో భారీ డిజాస్టర్ ని సొంతం చేసుకుని షాకిచ్చింది. ఈ మూవీ నుంచే రకుల్ కెరీర్ తెలుగు, తమిళ భాషల్లో డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది.
దీంతో బాలీవుడ్ కు మకాం మార్చేసిన రకుల్ 'దే దే ప్యార్ దే' మూవీతోమంచి విజయాన్ని సొంతం చేసుకుని అక్కడి వారికి ఎట్రాక్ట్ చేసింది. గ కొంత కాలంగా బాలీవుడ్ కె పరిమితమైన రకుల్ ప్రస్తుతం కమల్ తో చేస్తున్న 'ఇండియన్ 2'పై భారీ ఆశలు పెట్టుకుంది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ఇదిలా వుంటే ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ ని పరిచయం చేసిన రకుల్ పెళ్లి త్వరలో అంటూ చెప్పుకొచ్చింది.
అప్పటి నుంచి రకుల్ పెళ్లి వార్తలు పుట్టుకొస్తూనే వున్నాయి కానీ పెళ్లి మాత్రం జరగడం లేదు. కొంత మందేమో తను సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుందని చెబుతున్నారు. తనపై వస్తున్న పెళ్లి వార్తలపై రకుల్ తాజాగా స్పందించింది. 'గూగుల్ లో నా పేరు టైమ్ చేస్తే అలర్ట్ లో వచ్చేస్తోంది. నేను పెళ్లి తేదీ గురించి ప్రత్యేకంగా సెర్చ్ చేయాల్సిన పని లేదు. ప్రతివారం నా మీద ఆర్టికల్స్ వస్తున్నాయి. వాటి ప్రకారమే నేను గత ఏడాది నవంబర్ లోనే పెళ్లి చేసుకున్నారను. అయితే అది ఎలా జరిగిందో చెప్పడం లేదు' అంటూ సెటైర్ వేసింది.
ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ తన బాయ్ ఫ్రెండ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మేం ఎవరి దారిలో వాళ్లం బిజీగా వున్నాం. అలా అని మేం చేసే పనుల గురించి ఎప్పుడూ చర్చింకోం. నేను ఎప్పుడైనా కొన్ని విషయాల గురించి మాట్లాడుతుంటాను. రిలేషన్ షిప్ లో వున్న మాకు ఒకరిపై ఒకరికి ఎంతో గౌరవం వుంది. దీని వల్ల భద్రత అనేది ఏర్పడుతుంది' అంటూ చెప్పుకొచ్చింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.