Begin typing your search above and press return to search.
అన్నే కాదు.. మేం కూడా ఆకలి తీరుస్తాం! అంటున్న ఫ్యాన్స్
By: Tupaki Desk | 7 April 2020 5:30 PM GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ హీరోగా వెలిగిపోతున్న ఎన్టీఆర్ ఆపదలో ఉన్నవారికి కూడా తనవంతు సాయం అందించడంలో ముందుంటాడు. అనేక సేవా కార్యక్రమాలతో ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. హీరో తారక్ మాత్రమే కాదు.. ఆయన అభిమానులు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేకాదు వీళ్లు కూడా కష్టాల్లో ఉన్నవారికి తమ వంతు సాయం అందిస్తున్నారు. తాజాగా ఆకలితో బాధపడే అనాథల కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సంబంధించిన టీమ్ తారక్ ట్రస్ట్ సభ్యులు కొంత మంది కలిసి 'డొనేట్ ఏ మీల్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో లాక్ డౌన్ సందర్భంగా ఎక్కడి ప్రజలు అక్కడే నిలిచిపోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫుట్‌పాత్‌ల మీద జీవిస్తూ అన్నం కోసం ఎదురు చూసే వాళ్ల కోసం టీమ్ తారక్ ట్రస్ట్ సభ్యులు ఫుడ్ అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సందర్భంగా తారక్ టీమ్ ట్రస్ట్ సభ్యులు తిరుపతి, గద్వాల్, గుంటూరు, కరీంనగర్, విజయవాడ, హైదరాబాద్, కర్నాటకలోని పలు ప్రాంతాల్లో అక్కడి అధికారుల పర్మిషన్ తో ఆకలితో అలమటించే బీదసాదాలకు అన్నం పెడుతూ కాలికే కడుపులకు అండగా నిలుస్తున్నారు. ఎన్టీఆర్ మాత్రమే కాదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పేదల ఆకలి తీర్చడంతో రాష్ట్ర ప్రజలు సంతోషిస్తున్నారు.