Begin typing your search above and press return to search.

RRR కి ఆస్కార్ ద‌క్కాలంటే ఇదొక్క‌టే దారి

By:  Tupaki Desk   |   16 Sep 2022 4:19 AM GMT
RRR కి ఆస్కార్ ద‌క్కాలంటే ఇదొక్క‌టే దారి
X
ఈసారి ఆస్కార్ నామినేష‌న్స్ లో ఒక తెలుగు సినిమా పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్.ఆర్.ఆర్ క‌చ్ఛితంగా అకాడెమీ అవార్డు గెలుచుకుంటుంద‌ని భావిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ చిత్రం భార‌త‌దేశంతో పాటు ప్ర‌పంచ దేశాల్లో విశేష ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. ఈ సినిమాని అమెరిక‌న్లు ఆంగ్లేయులు విప‌రీతంగా ఆద‌రించారు. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ‌వ్వ‌డంతో గొప్ప రీచ‌బులిటీ ద‌క్కింది.

అయితే ఆర్.ఆర్.ఆర్ కి ఆస్కార్ ద‌క్కాలంటే అంత సులువేమీ కాదు. ఈ సినిమాకి ప్ర‌చారం చాలా చాలా అవ‌స‌రం. దానికోసం క‌నీసం 5 మిలియ‌న్ డాల‌ర్లు అయినా ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. గ‌తంలో ఆస్కార్ లు అందుకున్న ప‌లు చిత్రాల ప్ర‌చారం కోసం ఇంత పెద్ద మొత్తం ఖ‌ర్చు చేసార‌ని అన‌లిస్టులు చెబుతున్నారు. 5 మిలియ‌న్లు అంటే దాదాపు 40కోట్లు పైమాటే. అంత పెద్ద మొత్తాన్ని ఖ‌ర్చు చేసి రాజ‌మౌళి బృందం ఆర్.ఆర్.ఆర్ కి ప్ర‌చారం చేస్తుందా? అన్న‌దే ఇప్పుడు అంద‌రి సందేహం. అయితే ఆస్కార్ లాంటి వేదికపై ఆర్.ఆర్.ఆర్ మెరుపులు మెరిపిస్తే అది తెలుగు జాతికి గ‌ర్వ‌కార‌ణం అవుతుంది. దానికోసం ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌నే ఆశిస్తున్నారు.

2020 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న పారాసైట్ మేకర్స్ ఆస్కార్ ప్రచారం కోసం సుమారు 5 మిలియన్ డాల‌ర్లు ఖర్చు చేసినట్లు గతంలో క‌థ‌నాలొచ్చాయి. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ టీమ్ కూడా అంత పెద్ద మొత్తాన్ని ఖ‌ర్చు చేసేందుకు ముందుకు వ‌స్తుందా? అన్న‌ది చూడాలి.

బాహుబ‌లి ఫ్రాంఛైజీ సినిమాల కంటే ఆర్.ఆర్.ఆర్ ఎంతో ఉన్న‌త‌మైన‌ద‌ని ఆస్కార్ అవార్డు గెలుచుకోవ‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. జాన‌ప‌ద కేట‌గిరీలో ఇది అద్భుత‌మైన ప్ర‌య‌త్న‌మ‌ని కూడా ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ముఖ్యంగా విదేశీయులు ఆర్.ఆర్.ఆర్ కి ఆస్కార్ ఇవ్వాల‌ని కోరుకుంటున్నారంటే దాని ప్ర‌భావం ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. కానీ ఈసారి ఈ ప్ర‌య‌త్నం వృధా కాకూడ‌ద‌ని భావిద్దాం. ప్ర‌చారం కోసం నిధులు స‌మ‌కూర్చుకునేందుకు రాజ‌మౌళి అండ్ టీమ్ ఏం చేస్తున్నార వెల్ల‌డి కావాల్సి ఉంది.

ఎన్టీఆర్ పేరు ఆస్కార్ బ‌రిలో..ఆస్కార్ 2022-23 బ‌రిలో నామినేష‌న్ కి అర్హ‌మైన సినిమాల గురించి ఉత్త‌మ ప్ర‌దర్శ‌న‌తో ఆక‌ట్టుకున్న‌ న‌టీన‌టుల గురించి ఇత‌ర విభాగాల ప్ర‌తిభావంతుల గురించి ఇప్ప‌టికే చ‌ర్చ సాగుతోంది. ఈసారి ఆస్కార్ నామినేష‌న్ బ‌రిలో నిలిచే సినిమాల జాబితా గురించి ఉత్కంఠ నెల‌కొంది. అలాగే తారక్ అభిమానులు సంబరాలు చేసుకునే వార్త ఇటీవ‌ల అందింది. ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో గోండు వీరుడు కొమురం భీమ్ గా న‌టించిన తార‌క్ ఎమోష‌న‌ల్ పెర్ఫామెన్స్ కి ఆస్కార్ కి ఆస్కారం ఉందా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చా సాగుతోంది.

పాపుల‌ర్ హాలీవుడ్ మ్యాగజైన్ 'వెరైటీ' వెలువ‌రించిన ఓ క‌థ‌నంలో ఎన్టీఆర్ పేరును ప్ర‌స్థావించ‌డం సంచ‌ల‌నమైంది. 'ర్యాంక్ లేని' విభాగంలో ఆస్కార్ ఉత్తమ నటుడు అవార్డుకు అవకాశం ఉన్న పోటీదారులలో జూనియర్ ఎన్టీఆర్ ను ఒకరిగా స‌ద‌రు వెరైటీ మ్యాగ‌జైన్ క‌థ‌నం పేర్కొంది. అలాగే రాజమౌళి .. RRR వరుసగా ఉత్తమ దర్శకుడు ఉత్తమ చలనచిత్ర అవార్డుల కోసం ఈ అన్ ర్యాంక్డ్ కేట‌గిరీలో పోటీదారుల జాబితాలో ఉన్నారు. నిజానికి ఈ మూవీకి ఆస్కార్ రావాల‌ని ఎవ‌రూ క‌ల‌గ‌న‌లేదు. ప్ర‌పంచ‌దేశాల్లో ప్ర‌జ‌లు త‌మ ప్ర‌శంస‌ల‌తో ఇప్ప‌టికే ఆస్కార్ ని మించి ఇచ్చారు. స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్ త‌ర‌హాలో ఆర్.ఆర్.ఆర్ ఏదైనా సంచ‌ల‌నం సాధిస్తే అది భార‌త‌దేశానికి ఎంతో గౌర‌వం. ఇలాంటి సంద‌ర్భంలో ఈ చిత్రం అకాడమీ అవార్డ్స్ కు ఒక్క నామినేషన్ ను పొందగలిగినా అది తెలుగు సినిమాకు సాధించిన అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలుస్తుంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

రామ్ చ‌ర‌ణ్ - రామారావు ప్ర‌ధాన పాత్ర‌ల్లో ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్.ఆర్.ఆర్ క‌మ‌ర్షియ‌ల్ గా పాన్ ఇండియా కేట‌గిరీలో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 1000 కోట్లు వ‌సూలు చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.