Begin typing your search above and press return to search.

#ఊ అంటావా.. OTTలో ఎక్స్ ట్రా ఊప్స్ తో డ‌బుల్ ట్రీట్

By:  Tupaki Desk   |   8 Jan 2022 6:30 AM GMT
#ఊ అంటావా.. OTTలో ఎక్స్ ట్రా ఊప్స్ తో డ‌బుల్ ట్రీట్
X
ఒక్క ఊర మాస్ ఐట‌మ్ నంబ‌ర్ తో సినిమా గ‌తిని మార్చేయ‌డం ఎలానో పండితుడు సుకుమార్ కి తెలిసినంతగా ఎవ‌రికీ తెలీదేమో. విడాకుల ప్ర‌క‌ట‌న అనంత‌రం ఎంతో టైమింగ్ లీ స‌మంత‌తో పుష్ప లో ఐట‌మ్ పాట చేయించాల‌న్న ఆలోచ‌న రావ‌డ‌మే పెద్ద కిక్కు అంటూ విశ్లేష‌ణ‌లు వెలువ‌డ్డాయి.

ఊ అంటావా మామా ఊఊ అంటావా! పాట‌తో సినిమా రేంజే కాదు సామ్ లెవ‌లే వేరేగా మారిపోయింది. ఇక ఈ పాట తొలి గ్లింప్స్ విడుద‌లైన‌ప్పటి నుంచి యూత్ ఒక‌టే ఊగిపోయింది. థియేట‌ర్ల‌లో పూర్తి సాంగ్ ని చూశాక స‌మంత గ్లామ‌ర్ ఎలివేష‌న్స్ కి వేడెక్కించే స్టెప్పుల‌కే గాయ‌ని హ‌స్కీ వాయిస్ కి బాగా సింక‌య్యి నాగిని నాట్య‌మాడారు. బ‌న్ని లాంటి డ్యాన్సింగ్ స్టార్ తో క‌లిసి స‌మంత వేడెక్కించే స్టెప్పులు వేసింది. గ‌ణేష్ ఆచార్య ఈ పాట‌కు కొరియోగ్ర‌ఫీ అందించారు. సింపుల్ స్టెప్స్ కొరియోగ్రాఫ్ చేసిన కానీ సెట్ ని వేడెక్కించ‌డంలో ఎక్క‌డా త‌గ్గ‌లేదు వెట‌ర‌న్ కొరియోగ్రాఫ‌ర్.

పుష్ప - ది రైజ్ చిత్రం ఇప్ప‌టికే 350కోట్ల క్ల‌బ్ లో అడుగుపెట్టిందని క‌థ‌నాలొచ్చాయి. ఒక తెలుగు సినిమా పాన్ ఇండియా కేట‌గిరీలో ఇంత‌టి విజ‌యం సాధించ‌డం నిజంగా ఒక సెన్సేష‌న్.. బాహుబ‌లి- కేజీఎఫ్ త‌ర్వాత మ‌ళ్లీ అంత‌టి విజ‌యంగా ప‌రిగ‌ణించ‌బ‌డుతోంది.

తాజాగా పుష్ప OTTలో విడుదలై గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కించుకుంటోంది. అల్లు అర్జున్ `పుష్ప: ది రైజ్` తెలుగు- తమిళం- కన్నడ- మలయాళ వెర్షన్లు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్నాయి. పుష్ప OTT విడుదలకు సంబంధించిన ఆసక్తికర డిబేట్ హాట్ టాపిక్ గా మారింది. ఓటీటీ వేదిక నుంచి స‌న్నివేశాల‌ క్లిప్ లు.. హాటెస్ట్ డ్యాన్స్ వీడియో క్లిప్పింగ్ లతో సోషల్ మీడియా వేడెక్కిపోతోంది.

పుష్ప: ది రైజ్ లో సమంత రెడ్-హాట్ ఐటెమ్ సాంగ్ వీడియో క్లిప్పింగ్ లు సోషల్ మీడియాలో అత్య‌ధికంగా వైర‌ల్ అవుతున్నాయి. ఊ అంటావా.. పాటలో సమంత చేసిన బోల్డ్ డ్యాన్స్ వీడియోలతో ట్విట్టర్ టైమ్ లైన్ దాదాపు పూర్తిగా నిండిపోయింది. ఈ చిత్రంలో సమంత ఐటెం సాంగ్ చుట్టూ ఉన్న హైప్ ఎంతో దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. పుష్పలో ఐటెం సాంగ్ చేయడానికి సమంత మొదట సంకోచించిందని సుకుమార్ ఒప్పించిన తర్వాత ఆమె అంగీకరించిన సంగ‌తి తెలిసిన‌దే. ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ లో న‌టించిన త‌ర్వాత స‌మంత‌కు ఇది పెద్ద మైలేజ్ ఇచ్చింద‌ని చెప్పాలి. టైమింగ్ లో స‌మంత‌తో చేయించిన ఐట‌మ్ సాంగ్ అటు హిందీ బెల్ట్ లో భారీ మాస్ వ‌సూళ్ల‌కు సాయ‌మ‌య్యింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది.