Begin typing your search above and press return to search.

ఊపిరి మినిమం 44 కోట్లు తేవాలి

By:  Tupaki Desk   |   27 March 2016 11:30 AM GMT
ఊపిరి మినిమం 44 కోట్లు తేవాలి
X
ఎంత ద్విభాషా చిత్రం అయినా.. నాగార్జున-కార్తి లాంటి పెద్ద కథానాయకులు ఉన్నా.. ‘ఊపిరి’ సినిమా మీద రూ.60 కోట్ల బడ్జెట్ పెట్టడం సాహసమే. ఈ సినిమా బడ్జెట్ ఇంత అని తెలిసి టాలీవుడ్ జనాలు షాకైపోయారు. పీవీపీ సంస్థ ఏ ధైర్యంతో ఇంత ఖర్చు పెట్టిందబ్బా అనుకున్నారు. ఐతే సంక్రాంతికి వచ్చిన నాగ్ మూవీ ‘సోగ్గాడే చిన్నినాయనా’ బ్లాక్ బస్టర్ హిట్టు కావడం.. ‘ఊపిరి’కి బాగానే కలిసొచ్చింది. టీజర్ - ట్రైలర్ అన్నీ కూడా ఆకర్షణీయంగా ఉండటంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది. బిజినెస్ కూడా బాగానే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రెండు భాషల్లో కలిపి రూ.44 కోట్ల బిజినెస్ జరగడం విశేషం.

తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులే రూ.25 కోట్లకు అమ్మారు. నైజాం ఏరియాకు దిల్ రాజు రూ.8 కోట్లకు సినిమాను కొన్నాడు. సీడెడ్ హక్కులు రూ.4.5 హక్కులు పలికాయి. ఆంధ్రాలోని మిగతా ప్రాంతాలన్నీ కలిపి రూ.12 కోట్లు తెచ్చిపెట్టాయి. ఐతే తెలుగులో జరిగిన స్థాయిలో తమిళ వెర్షన్ బిజినెస్ జరగలేదు. ‘తోళ’ హక్కుల్ని రూ.12 కోట్లకే అమ్మింది పీవీపీ సంస్థ. ఓవర్సీస్ హక్కులు రెండు భాషలకూ కలిపి రూ.4 కోట్ల దాకా పలికాయి. అందులో తెలుగు రైట్సే రూ.3 కోట్లు కావడం విశేషం. మొత్తం కలిపితే వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ.44 కోట్ల దాకా వచ్చాయి. అంటే కనీసం రూ.44 కోట్ల షేర్ తెస్తేనే ‘ఊపిరి’ బయ్యర్లు బయటపడతారన్నమాట. ఐతే సినిమాను రూ.44 కోట్లకు అమ్మిన పీవీపీ సంస్థ... మిగతా బడ్జెట్ రికవరీకి తగ్గట్లు ప్రణాళికలతోనే ఉంది. ఇంకా రెండు భాషల శాటిలైట్ రైట్స్ అమ్మాల్సి ఉంది. అవే రూ.15 కోట్ల దాకా వచ్చే అవకాశాలున్నాయి. హిందీలోకి రీమేక్ రైట్స్ కూడా అమ్ముతున్నారు కాబట్టి పీవీపీకి లాభాలు రావడం గ్యారెంటీ.