Begin typing your search above and press return to search.
ఊపిరి ఒరిజినల్ ట్రైలర్ చూశారా?
By: Tupaki Desk | 17 March 2016 9:33 AM GMTహాలీవుడ్ నుంచి గుట్టు చప్పుడు కాకుండా కథల్ని ఎత్తుకొచ్చేసి సినిమాలు చేసేసి అది తమ ఘనతగా చెప్పుకునే పరిస్థితి లేదిప్పుడు. ఒక చిన్న సన్నివేశం అయినా.. బ్యాగ్రౌండ్ స్కోర్ అయినా సరే.. కాపీ కొడితే ఇట్టే పట్టేస్తున్నారు జనాలు. కాబట్టి ఫ్రీమేక్ కంటే.. అఫీషియల్ గా రీమేక్ చేయడమే బెటరనుకుంది పీవీపీ సంస్థ. అందుకే ఫ్రెంచ్ మూవీ ‘ది ఇన్ టచబుల్స్’ కథతో తెలుగులో సినిమా తీద్దామని వంశీ పైడిపల్లి అంటే.. పద్ధతిగా రీమేక్ రైట్స్ తీసుకున్నారు. బహుశా సౌత్ ఇండియాలో ఓ ఇంటర్నేషనల్ మూవీకి అఫీషియల్ రీమేక్ గా వస్తున్న తొలి సినిమా ఇదే కావచ్చేమో. చక్రాల కుర్చీకే పరిమితమైన ఓ బిలియనీర్.. ఓ ఆవారా కుర్రాడి సాయంతో అసలైన ఆనందాన్ని పొందే కథాంశంతో తెరకెక్కిన సినిమా ఇది. ఎమోషన్స్ మీద నడిచే ఈ సినిమా మంచి అంచనాల మధ్య ఈ నెల 25న తెలుగు - తమిళ భాషల్లో రిలీజవుతోంది.
ఈ మధ్యే విడుదలైన ‘ఊపిరి’ థియేట్రికల్ ట్రైలర్ కు ఎంత మంచి స్పందన వచ్చిందో చూశాం కదా. మరి ఒరిజినల్ ‘ది ఇన్ టచబుల్స్’ ట్రైలర్ ఎలా ఉందో చూశారో. ఒకసారి దాని మీద కూడా ఓ లుక్కేసి చూడండి. వంశీ పైడిపల్లి.. ఆ సినిమాను ఎంత వరకు కాపీ కొట్టాడో ఏంటో కానీ.. ట్రైలర్ ను కూడా కొంత వరకు దించేశాడు. ట్రైలర్లో దాదాపు సగ భాగం ‘ది ఇన్ టచబుల్స్’ నుంచి తీసుకున్నదే. కార్తికి ఇంటర్వ్యూ జరిగే సన్నివేశం.. అతను తనకు కేటాయించిన గది చూసి ఆశ్చర్యపోయే సీన్.. నాగ్ కాళ్ల మీదికి వేడి నీళ్లు పోసే సన్నివేశం.. ఇంకా కొన్ని షాట్లు ‘ది ఇన్ టచబుల్స్’ ట్రైలర్లోనూ సేమ్ టు సేమ్ ఉండటం విశేషం. సినిమాలో సన్నివేశాలు దించేస్తే ఓకే కానీ.. మరీ ట్రైలర్ కూడా కాపీ కొట్టడం విడ్డూరమే.