Begin typing your search above and press return to search.
తెలుగు ‘ఊపిరి’ 20 నిమిషాల ముందే ఆగిపోతుంది
By: Tupaki Desk | 25 March 2016 6:18 AM GMTఒకే సినిమా రెండు భాషల్లో విడుదలైతే దాదాపుగా అంతా ఒకేలా ఉంటుంది. కానీ, తాజాగా రిలీజవుతున్న ఊపిరి సినిమా విషయంలో మాత్రం చాలా తేడా కనిపిస్తోంది. సాధారణంగా ద్విభాషా సినిమాల్లో లాంగ్వేజ్ బోర్డులు మార్పించడం.. కొన్ని పాత్రల్ని స్థానిక నటీనటులతో చేయించడం లాంటి మార్పులు తప్ప పెద్ద తేడా ఏమీ ఉండదు. ముఖ్యంగా కథాకథనాల్లో పెద్దగా మార్పులేమీ ఉండవు. ఐతే 'ఊపిరి' సినిమా విషయంలో మాత్రం తెలుగు - తమిళ వెర్షన్ల మధ్య భారీ వ్యత్యాసం ఉందట. ఎడిటింగ్ లో చాలావరకు సీన్లు తీసేసినట్లు చెబుతున్నారు. తెలుగులో ఉన్న ప్రతి సన్నివేశం తమిళంలో ఉంటుంది కానీ.. తమిళంలోని కొన్ని సన్నివేశాలు తెలుగులో కనిపించవు. ఎందుకంటే రెంటి మధ్య నిడివిలో అంత తేడా ఉంది మరి. తమిళ వెర్షన్ ఏకంగా 20 నిమిషాలు ఎక్కువ ఉండటం విశేషం. ఊపిరికి తమిళ వెర్షన్ 'తోళ' 2 గంటల 53 నిమిషాల నిడివితో ఉండగా తెలుగు ఊపిరి 2 గంటల 33 నిమిషాలే.
కాగా రెండు భాషల్లోనూ ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది. మరోవైపు 'తోళ' టైటిల్ విషయంలో నెలకొన్న వివాదాన్ని కూడా కోర్టు బయటే పరిష్కరించుకున్నాడు నిర్మాత పొట్లూరి వరప్రసాద్. దీంతో తమిళంలో విడుదలకు ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో తెలుగు - తమిళ భాషల్లో ఏకంగా 2 వేల థియేటర్లలో శుక్రవారం ఈ సినిమా రిలీజయిపోయింది.