Begin typing your search above and press return to search.
క్రికెట్ మ్యాచ్ ను వాడేస్తున్న ఊపిరి
By: Tupaki Desk | 24 March 2016 7:45 AM GMTనాగార్జున - కార్తీల మల్టీస్టారర్ మూవీ 'ఊపిరి' విడుదలకు మరొక్క రోజు మాత్రమే గ్యాప్ ఉంది. ఇప్పటికే టీం అంతా ప్రమోషన్ కార్యక్రమాల్లో తెగ బిజీగా ఉన్నారు. నాగార్జున - కార్తీ - తమన్నా - దర్శకుడు వంశీ పైడిపల్లి.. ఇలా అందరూ ఎడాపెడా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తూ.. ఊపిరి మూవీ ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో.. ఆ సినిమా వాళ్లకు ఎందుకంత స్పెషలో చెప్పుకొస్తున్నారు.
ఈ ప్రమోషన్స్ లో భాగంగా.. అభిమానులను తమ 'ఊపిరి క్షణం' ను అప్ లోడ్ చేయాల్సిందిగా కోరారు. తమ లైఫ్ లో ఊపిరి బిగబట్టాల్సి వచ్చిన సందర్భాలను అందరితో పంచుకోవాల్సి ఉంటుందన్న మాట. అయితే.. అనుకోని వరంగా ఇండియా-బంగ్లాదేశ్ క్రికెట్ మ్యాచ్ ఈ టీంకి కలిసొచ్చింది. బంగ్లాదేశ్ ఆఖరి మూడు బంతుల్లో 2 పరుగులు చేయాల్సి ఉండగా.. 3 బాల్స్ కు 3 వికెట్లు తీసి.. ఉత్కంఠభరిత మ్యాచ్ ను గెలిచించి టీం ఇండియా.
'ఇండియా జట్టు తమ ఊపిరి మూమెంట్ ను అనుభవించారు. మీరు కూడా ఆ క్షణంలో ఉండే థ్రిల్ ఏంటో అనుభవించాలంటే ఊపిరి సినిమా చూడండి' అంటూ ప్రచారం ప్రారంభించేసింది ఊపిరి యూనిట్. ప్రచారం అంటే అలా ఉండాలి కదూ. ఆఖర్లో కలిసొచ్చిన విషయాన్ని తమ పబ్లిసిటీ కోసం చక్కగా ఉపయోగించేసుకుంటున్నారు. అయినా ప్రేక్షకులకు సినిమాని దగ్గర చేయడానికి.. క్రికెట్ కంటే మంచి సాధనం ఇంకేముంటుంది.