Begin typing your search above and press return to search.

కొత్త సెంటిమెంట్ కి ఊపిరి పోసిన నాగ్

By:  Tupaki Desk   |   10 March 2016 12:19 PM GMT
కొత్త సెంటిమెంట్ కి ఊపిరి పోసిన నాగ్
X
ఓ సక్సెస్ చాలమంది లైఫ్ ని మార్చేస్తుందన్న మాట ఎంత నిజమో.. అదే సక్సెస్ కొత్త సెంటిమెంట్లను పుట్టిస్తుందన్నది కూడా అంతే నిజం. నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన ఎవరూ ఊహించని రేంజ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సీనియర్ హీరోల్లో తొలిసారిగా 50 కోట్ల షేర్ ను అందుకున్న రికార్డును నాగ్ సొంతం చేసుకున్నారు.

సోగ్గాడే చిన్ని నాయన ప్రమోషన్స్ లో నాగార్జునతో పాటు ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్ కూడా భాగం అయ్యారు. తండ్రి సినిమా కోసం బాగానే పబ్లిసిటీ చేశారు. నాగార్జున - నాగచైతన్య - అఖిల్.. ముగ్గురూ కలిసి పంచెకట్టులో కనిపించిన లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా భారీ ఓపెనింగ్స్ కి ఈ ప్రచారం కారణంగా అయింది. ఇప్పుడు ముగ్గురూ కలిసి ప్రమోట్ చేయడం నాగ్ కు సెంటిమెంట్ గా మారిందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఊపిరి చిత్రానికి కూడా కొడుకులిద్దరితో ప్రమోషన్స్ చేయించేలా ప్లాన్ చేశారు నాగార్జున.

ఊఫిరి ఆడియో ఫంక్షన్ గతంలోనే జరిగినా, అప్పుడు థియేట్రికల్ ఇవ్వలేదు. దీన్ని కూడా భారీ ఎత్తున ప్రచారానికి ఉపయోగించుకునేలా నాగ్ ప్లాన్ చేయడమే దీనికి కారణం. ఈరోజు ఈవెనింగ్‌ జరిగిన ధియేట్రికల్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంటుకు కూడా.. మరోసారి నాగ చైతన్య - అఖిల్ లు కలిసి విచ్చేశారు. కలిసే ప్రమోట్ చేశారు. మరి ఈ కొత్త సెంటిమెంట్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో?