Begin typing your search above and press return to search.
'అంటే.. సుందరానికీ' ఏమైంది..? ఓపెనింగ్స్ మరీ ఇలా ఉన్నాయేంటి..??
By: Tupaki Desk | 11 Jun 2022 7:31 AM GMTనేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ''అంటే సుందరానికీ!" నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి ఆట నుంచే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. దాన్ని వసూళ్ళుగా మార్చుకోలేకపోయిందని తెలుస్తోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద వీక్ ఓపెనింగ్స్ వచ్చాయి.
'అంటే.. సుందరానికీ' సినిమా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు కలుపుకొని ఫస్ట్ డే కేవలం రూ. 3.87 కోట్ల షేర్ తో.. 6.50 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. బీ సీ సెంటర్స్ లో ఆక్యుపెన్సీ డల్ గా ఉండగా.. మల్టీప్లెక్స్‌లలో మరియు అర్బన్ ఏరియాలలో ఫస్ట్ షో సమయానికి పుంజుకోవడంతో ఈ మాత్రం కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు.
'అంటే సుందరానికీ' అనేది ప్యూర్ క్లాస్ మూవీ. నాని అభిమానులకు మాత్రమే మెప్పిస్తుందనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమా బలహీనమైన ఓపెనింగ్స్ రాబట్టడానికి టికెట్ రేట్లు కూడా ఒక కారణమని అంటున్నారు. ఓటీటీలకు అలవాటు పడిపోయిన జనాలు.. రూ. 200+ పెట్టి టిక్కెట్లు కొనడానికి సుముఖంగా లేరని తెలుస్తోంది.
అలానే 'విక్రమ్' 'మేజర్' సినిమాలు రెండో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద గట్టిగా నిలబడటం నాని సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావం చూపిందని అంచనాలు వేస్తున్నాయి. ఈ క్రమంలో 'అంటే..' కు శనివారం మార్నింగ్ షో బుకింగ్స్ 35 శాతం మాత్రమే జరిగాయి. నాని సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవాలంటే ఈ వారంతంలో స్ట్రాంగ్ గా నిలబడాల్సిన అవసరముంది. శని ఆదివారాల్లో వచ్చే వసూళ్లను బట్టి ఈ సినిమా భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
ఏదైతేనేం ఇటీవల కాలంలో నాని నటించిన వాటిల్లో తక్కువ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా 'అంటే సుందరానికీ' నిలిచింది. MCA(మిడిల్ క్లాస్ అబ్బాయి) మూవీ తొలి రోజు రూ.7.57 కోట్లు వసూలు చేయగా.. 'కృష్ణార్జున యుద్ధం' ఓపెనింగ్ డే నాడు రూ.4.62 కోట్లు అందుకుంది. 'జెర్సీ' (4.47 కోట్లు) - 'నాని గ్యాంగ్ లీడర్' (4.57 కోట్లు) - 'శ్యామ్ సింగరాయ్' - (4.17 కోట్లు) ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు 'అంటే..' 3.87 కోట్లు సాధించింది.
* ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం AP/TS ఫస్ట్ డే 'అంటే సుందరానికీ' కలెక్షన్స్ పరిశీలిస్తే..
నైజాం: 1.56 Cr
సీడెడ్: 0.38 cr
యూఏ: 0.44 cr
వెస్ట్: 0.34 cr (10L హైర్స్)
ఈస్ట్: 0.34 cr
గుంటూరు: 0.34 cr
కృష్ణా: 0.28 cr
నెల్లూరు: 0.19cr
మొత్తం - 3.87 cr (షేర్)
కాగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన 'అంటే సుందరానికీ' చిత్రంలో నాని సరసన నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించింది. సీనియర్ నరేష్ - రోహిణి - శ్రీకాంత్ అయ్యంగార్ - నదియా - హర్ష వర్ధన్ - రాహుల్ రామకృష్ణ - సుహాస్ - పృథ్వీరాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని - యలమంచిలి రవిశంకర్ ఈ సినిమాని నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చగా.. నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. తెలుగుతో పాటుగా తమిళ మలయాళ భాషల్లో కూడా నాని సినిమా రిలీజ్ అయింది.