Begin typing your search above and press return to search.
మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు
By: Tupaki Desk | 25 May 2018 6:07 AM GMT2007 లో వచ్చిన ఆపరేషన్ దుర్యోధన సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పోసాని మార్క్ టాలెంట్ డైరెక్షన్ ఆ సినిమాతో పచ్చిగా బయటపడింది. హీరో శ్రీకాంత్ నటన సినిమాకు ప్రాణంలా నిలిచి అద్భుత విజయాన్ని అందుకుంది. రాజకీయాల్లోకి వచ్చే ముందు ప్రజల్ని మార్చాలనే కాన్సెప్ట్ కు ఎన్నో గౌరవాలు దక్కాయి. అయితే ఈ సారి శ్రీకాంత్ మళ్లీ అదే తరహాలో మరో కాన్సెప్ట్ తో రానున్నాడు.
ఆపరేషన్ 2019 అనే టైటిల్ తో రానున్న రాజకీయాలకు మ్యాచ్ అయ్యేట్లు చెప్పేశారు. ఇక బివేర్ ఆఫ్ పబ్లిక్ అనే ట్యాగ్ లైన్ తో ప్రజలున్నారు జాగ్రత్త అంటూ మరో పంచ్ గట్టిగా ఇచ్చేశారు. అమ్ముడు పోయే రాజకీయాలలో ప్రజలు కూడా డబ్బుకు ఆశపడి ఓట్లు వేయడం కామన్ అయిపొయింది. దాన్ని పాయింట్ అవుట్ చేస్తూ కరణం బాబ్జి తెరకెక్కించాడు. ఇక పబ్లిక్ స్థార్ శ్రీకాంత్ అయితే నట విశ్వరూపం చూపించాడని చెప్పవచ్చు.
ఒక డైలాగ్ తో అయితే విజిల్స్ వేయించాడనే చెప్పాలి. 'గాంధీ కడుపున గాంధీ పుట్టడు - ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు, మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు... ఎవరైనా ప్రజల్లో నుండి పుట్టుకురావాల్సిందే. వివిధ రూపాల్లో వివిధ పేర్లతో సమ్ ఆర్ కమింగ్ సమ్ ఆర్ గోయింగ్' అనే డైలాగ్ ఎక్కువగా ఆకర్షించింది. కోట శ్రీనివాస రావ్ పోసాని కృష్ణ మురళి లాంటి నటులు కూడా ఉన్నారు. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.