Begin typing your search above and press return to search.
అణుబాంబ్ పితామహుని కథతో నోలాన్ ప్రయోగం
By: Tupaki Desk | 28 July 2022 5:12 PM GMTఆస్కార్ విజేత క్రిస్టోఫర్ నోలన్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు అంటే దానిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంటుంది. అతడి కథల ఎంపిక ఎంతో యూనిక్ నెస్ తో కూడుకుని ఉంటుంది. ఇక మేకింగ్ పరంగానూ హైస్టాండార్డ్స్ తో సృజనాత్మకతను పరాకాష్టలో చూపించడంలో నోలాన్ ప్రత్యేకత వేరు.
హాలీవుడ్ లో ఎందరు దర్శకులు ఉన్నా నోలాన్ ప్రత్యేకత ఉన్న దర్శకుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు. ది డార్క్ నైట్- ఇన్ సెప్షన్-టెనెట్- డన్ కిర్క్- ఇంటర్ స్టెల్లార్ ఇవన్నీ క్లాసికల్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఇవన్నీ ఎన్నో అవార్డులు రివార్డులను కొల్లగొట్టాయి. అతడి ప్రతి సినిమా ఆస్కార్ కి పోటీపడుతోంది. అందుకే నోలాన్ నుంచి సినిమా వస్తోంది అంటే ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది.
తదుపరి అతడు `ఓపెన్ హీమర్` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది అణుబాంబ్ విస్పోటనంపై తెరకెక్కుతున్న హై స్టాండార్డ్ టెక్నికల్ గ్లిజ్ మూవీ. అటామిక్ బాంబ్ పితామహునిగా పేరొందిన ప్రముఖ శాస్త్రవేత్త J. రాబర్ట్ ఓపెన్ హీమర్ జీవితకథతో ఈ చిత్రాన్ని అతడు తెరకెక్కిస్తున్నారు. టైటిల్ పాత్రలో సిలియన్ మర్ఫీ నటించారు.
`ఓపెన్ హీమర్` మొదటి అధికారిక ట్రైలర్ తాజాగా రిలీజైంది. రెండవ ప్రపంచ యుద్ధంలో జే.రాబర్ట్ అణు బాంబు తయారీలో కీలక పాత్రధారిగా. తరువాత అతడు రకరకాల అభియోగాలను ఎదుర్కొన్నాడు. యునైటెడ్ స్టేట్స్ పై అతడి విధేయతను హాకిష్ ప్రభుత్వ అధికారులు ప్రశ్నించడం అప్పట్లో సంచలనమైంది. ఇప్పుడు అదే కథను తనదైన శైలిలో ఎంతో హృద్యంగా తెరకెక్కిస్తున్నారు నోలాన్. మొదటి ట్రైలర్ లో ఇది స్పష్ఠంగా లేకపోయినా అణుబాంబ్ పితామహుని ఆహార్యాన్ని బాంబ్ విస్పోటనాన్ని ఎంతో వండర్ ఫుల్ గా ఆవిష్కరించారు. నోలాన్ శైలి మేకింగ్.. బ్లాక్ అండ్ వైట్ షాట్ లు .. కణకణ మండుతున్న రంగుల గ్లింప్స్ ఇవన్నీ మరో లోకాన్ని ఆవిష్కరించాయి. ఈ ట్రైలర్ తో సినిమా విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే.
ప్రఖ్యాత హాలీవుడ్ రిపోర్టర్ కథనం ప్రకారం.. కై బర్డ్ .. దివంగత మార్టిన్ J. షెర్విన్ రచించిన 2005 పులిట్జర్ ప్రైజ్-విన్నింగ్ పుస్తకం `అమెరికన్ ప్రోమేథియస్: ది ట్రయంఫ్ అండ్ ట్రాజెడీ ఆఫ్ J. రాబర్ట్ ఓపెన్ హీమర్`` ఆధారంగా `ఓపెన్ హీమర్` మూవీ తెరకెక్కుతోంది. ఈ యూనివర్సల్ ప్రాజెక్ట్ కోసం బిడ్డింగ్ లో ఈ కథను గెలుచుకోవడం ఆసక్తికరం. వార్నర్ బ్రదర్స్ తో కలిసి నోలాన్ తన సొంత స్టూడియో హోమ్ బ్యానర్ లో మొదటి చిత్రంగా దీనిని రూపొందిస్తున్నారు.
సిలియన్ మర్ఫీ- రాబర్ట్ డౌనీ జూనియర్- మాట్ డామన్- ఎమిలీ బ్లంట్- ఫ్లోరెన్స్ పగ్- రామి మాలెక్- బెన్నీ సఫ్డీ- జోష్ హార్ట్ నెట్- డేన్ డెహాన్- జాక్ క్వాయిడ్- మాథ్యూ మోడిన్- ఆల్డెన్ ఎహ్రెన్ రిచ్- డేవిడ్ క్రుమ్‌హోల్ట్జ్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 21 జూలై 2023న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ గా విడుదల కానుంది.