Begin typing your search above and press return to search.
దర్శకేంద్రుడి చేతిలో పడితే సామాన్యులు సూపర్ స్టార్లు అవుతారు!
By: Tupaki Desk | 15 Aug 2022 3:43 AM GMTశ్రీధర్ సీపానకి రచయితగా చాలా సినిమాలకి పనిచేసిన అనుభవం ఉంది. ఆయన దర్శకుడిగా రూపొందించిన సినిమానే 'వాంటెడ్ పండుగాడ్'. సాయిబాబా - వెంకట్ నిర్మించిన ఈ సినిమాకి రాఘవేంద్రరావు సమర్పకులుగా వ్యవహరించారు.
సునీల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో చాలామంది కమెడీయన్స్ సందడి చేశారు. క్రైమ్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ సినిమాను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
ఈ వేదికపై తనికెళ్ల భరణి మాట్లాడుతూ .. "కరోనా పాపం పండింది .. అందుకనే 'వాంటెండ్ పండుగాడ్' వచ్చాడు. రాఘవేంద్రరావు గారి చూపు పడితే ముళ్లు పూలవుతాయి .. పూలు పళ్లవుతాయి .. సామాన్యులు సూపర్ స్టార్లు అవుతారు. ఈ స్టేజ్ పై రేలంగి మొదలు ఎమ్మెస్ వరకూ అందరినీ ఒకసారి గుర్తుచేశారు. మా కమెడియన్స్ కి అది ఒక నీరాజనంగా భావిస్తున్నాను. మా అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకున్న మహా వ్యక్తి రాఘవేంద్రరావుగారు.
ఎవరైనా సరే బోర్ కొడితే విహారానికి వెళదామని అనుకుంటారు. కానీ మాకు రాఘవేంద్రరావు సినిమాకి వెళ్లడమే ఒక విహారంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఆర్టిస్టులను టెన్షన్ పెట్టరు.
ఆర్టిస్టులు తమకి ఏదైనా పనుందని చెబితే ముందుగా వాళ్ల షాట్స్ తీసేసి పంపించేవారు. అలా ఆర్టిస్టుల కష్టసుఖాలు ముందే తెలిసిన మహానుభావుడు మా రాఘవేంద్రరావుగారు. ఆనందం సముద్రమైతే దానికి మనిషి రూపం వస్తే మా రాఘవేంద్రరావుగారు.
శ్రీధర్ సీపాన గొప్ప రచయిత .. ఆయన దర్శకుడిగా ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు .. పక్క నుండి రాఘవేంద్రరావు ఆశీర్వదించారు. సునీల్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ రోల్ చేశాడు. ఈ కథ మా శిష్యుడు జనార్ధన మహర్షిది .. మాటలు చాలా అద్భుతంగా రాశాడు. ఒకప్పుడు ఈ కథను నేను డైరెక్ట్ చేద్దామనుకున్నాను కానీ కుదరలేదు. కానీ మంచివాళ్ల చేతుల్లోనే పడింది. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక విందు భోజనంలా ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.