Begin typing your search above and press return to search.
డైరెక్ట్ ఓటీటీ రిలీజులన్నీ మళ్ళీ థియేట్రికల్ రిలీజ్ కానున్నాయా..?
By: Tupaki Desk | 9 Dec 2020 1:30 AM GMTకరోనా కారణంగా థియేటర్స్ క్లోజ్ అవడంతో సినిమాలన్నీ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ని ఆశ్రయిస్తున్నాయి. తెలుగులో కూడా ఇప్పటికే అనేక సినిమాలు డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల అయ్యాయి. థియేటర్లు తెరుచుకోవడానికి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో మళ్ళీ సినిమాలను ప్రదర్శించడానికి రెడీ అవుతున్నారు. కాకపోతే కొత్త సినిమాలను విడుదల చేయడానికి మేకర్స్ సంకోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే డిజిటల్ రిలీజ్ చేయబడిన చిత్రాలను ఇప్పుడు మళ్లీ థియేట్రికల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఆహా ఓటీటీలో విడుదలైన 'ఒరేయ్ బుజ్జిగా' చిత్రాన్ని నూతన సంవత్సర కానుకగా జనవరి 1న థియేటర్ లలో విడుదల చేస్తున్నారు. ఇదే క్రమంలో డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ చేసిన సినిమాల్ని థియేటర్స్ లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. త్వరలోనే ఆహాలో మంచి టాక్ తో నడిచిన 'కలర్ ఫొటో' సినిమా కూడా థియేట్రికల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ప్రస్తుతం 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్ని థియేటర్లు తెరుచుకుంటాయో ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ థియేటర్లు తెరుచుకున్నా ప్రేక్షకులు ఎప్పటిలా వస్తారా అనేది చూడాలి.