Begin typing your search above and press return to search.
ఆ యువ హీరో సినిమా ఓటీటీ రిలీజ్ చేసే ఆలోచన చేస్తారా...?
By: Tupaki Desk | 18 July 2020 10:30 AM GMTటాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ కి అర్జెంటుగా ఓ హిట్ అవసరం అనే పరిస్థితి ఏర్పడింది. 'ఉయ్యాలా జంపాల' చిత్రంతో వెండితెరకు పరిచయమైన షార్ట్ ఫిలిం హీరో రాజ్ తరుణ్ ఫస్ట్ సినిమాకే సురేష్ బాబు - నాగార్జున లాంటి వారి సపోర్ట్ ఉండటంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. దీంతో కొన్నాళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాకుండా వరుస ఆఫర్స్ తలుపుతట్టాయి. కెరీర్ ఆరంభంలో తన హుషారైన నటనతో 'సినిమా చూపిస్తా మామ' 'కుమారి 21F' లాంటి సూపర్ హిట్స్ అందుకున్నాడు. కానీ ఈ మధ్య రాజ్ తరుణ్ కు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. ఎన్ని సినిమాలు సెట్ చేసినా హిట్ మాత్రం అందని ద్రాక్షలా మారింది.
దీంతో నెక్స్ట్ సినిమాతో అయినా సక్సెస్ అందుకోవాలని 'గుండజారి గల్లంతయ్యిందే' ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో 'ఒరేయ్ బుజ్జిగా' అనే సినిమాలో నటించాడు రాజ్ తరుణ్. మాళవిక అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించారు. ఈ సినిమా మార్చి 25న ఈ సినిమా విడుదలకావాల్సింది. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా విడుదల ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
కాగా గత నాలుగు నెలలుగా థియేటర్స్ ఓపెన్ అవకపోవడంతో రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలన్నీ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఓటీటీలలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కీర్తి సురేష్ 'పెంగ్విన్'.. సురేష్ ప్రొడక్షన్స్ 'కృష్ణ అండ్ హిజ్ లీల' మరియు శరత్ మరార్ 'భానుమతి అండ్ రామకృష్ణ'.. సత్యదేవ్ '47 డేస్' సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. మరికొన్ని సినిమాలు రిలీజ్ కి సిద్ధపడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తే బెటర్ అనే కామెంట్స్ ఇండస్ట్రీ జనాల్లో వినిపిస్తున్నాయి.
రాజ్ తరుణ్ సినిమాల్లో హీరోయిన్ల కోసమైనా మాస్ ఆడియెన్స్ థియేటర్స్ కి వస్తారు అనుకోవడానికి.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న మాళవిక అయ్యర్ డిస్ట్రీబ్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రేజీ హీరోయిన్ కాదు. అందులోనూ రాజ్ తరుణ్ మార్కెట్ ఇప్పుడేమీ బాలేదు. అంతేకాకుండా ఈ సినిమా టైటిల్ కూడా ఓటీటీ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలాగే ఉంది. ఎటూ చూసినా 'ఒరేయ్ బుజ్జిగా'ను ఓటీటీ బాట పట్టిస్తే మంచిదనే సలహాలు ఫిల్మ్ సర్కిల్స్ మధ్య వినిపిస్తున్నాయి. థియేటర్ రిలీజ్ కోసం వెయిట్ చేయకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తే రాజ్ తరుణ్ ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ నిలబడతాయని కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో 'ఒరేయ్ బుజ్జిగా' ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి.