Begin typing your search above and press return to search.
#కరోనా: ఐదారు నెలల గ్యాప్ తర్వాత మొదటి పెళ్లి వేడుక
By: Tupaki Desk | 28 Sep 2020 5:34 PM GMTమాయదారి కరోనా మహమ్మారీ ఎంత పెద్ద దెబ్బ కొట్టింది? ఒకే ఒక్క దెబ్బకు సందడి అంతా చటుక్కున మాయమైంది. టాలీవుడ్ లో అప్పటివరకూ ప్రీరిలీజ్ లు ఆడియో వేడుకలు సక్సెస్ మీట్లు అంటూ ఒకటే హంగామా కొనసాగేది. నిరంతరం 150 మంది సినీజర్నలిస్టులు ప్రెస్ మీట్ల పేరుతో ఎప్పుడూ ఒకటే హడావుడిగా ఉండేవారు. ఒకే ఒక్క దెబ్బకు అన్నీ ఝామ్ అయిపోయాయి.
మార్చి చివరిలో మొదలైంది మహమ్మారీ. ఇప్పటికి ఐదారు నెలలు అయ్యింది. టాలీవుడ్ లో షూటింగులు బంద్.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్.. టోటల్ ప్రపంచమే బంద్ అయ్యింది. అన్ని పరిశ్రమలతో పాటు టాలీవుడ్ కూడా మూత పడిపోయింది. ఇది తీరని ఎడబాటు అందరికీ. ఇక నిరంతరం ప్రెస్ మీట్లు ఈవెంట్లు అంటూ తిరిగే సినీజర్నలిస్టులకు అయితే అసలు ఏదీ లేకుండా అయిపోయింది.
కోవిడ్ ఉన్నా ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటూ జనరల్ .. పొలిటికల్.. హెల్త్ వింగ్ జర్నలిస్టులు పరుగులు పెడుతున్నా సినీజర్నలిస్టులకు మాత్రం కావాల్సినంత విశ్రాంతి లభించింది. బయట తిరిగే పని లేకుండా ప్రింట్ మీడియా జర్నలిస్టులు ఆఫీసుల్లో కామ్ గా పని చేసుకుంటున్నారు. సెలబ్రిటీల జూమ్ ఇంటర్వ్యూలతో సరిపెట్టుకుంటున్నారు. ఈమీడియా .. ఫోటో జర్నలిస్టులకు కొన్నిటికి తప్పలేదు కానీ వాళ్లు కూడా సైలెంట్ గానే ఉన్నారు. ఇక సీసీసీ సరుకుల పంపిణీ వేళ క్రిటిక్స్ మీట్లకు మాత్రం వెళ్లారు కొందరు.
అయితే ఇటీవల ఏమైందో కానీ పిడుగు పాటులా అడపా దడపా ప్రెస్ మీట్లు పెడుతున్నారండోయ్. కరోనాకు ముందు ఎప్పుడూ ఓపెనింగుల హడావుడి ఉండేది. కానీ ఇప్పుడు సినిమాల ఓపెనింగులన్నీ వాట్సాప్ లలోనే సమాచారం వచ్చేస్తోంది. పూజ ఠెంకాయ కార్యక్రమం అంటూ ఏదో ఒకటి పంపేస్తున్నారు. మొన్న ఒక్క ఓపెనింగ్ వేడుక జరిగిందటగా!! అని జర్నలిస్టులు ఆరాలు తీసుకునే పరిస్థితి. అంతగా 150 మంది జర్నలిస్టులు ఎటు మాయమయ్యారో ఎవరికీ తెలీదు. ఇందులో కొందరు మాత్రమే ఆఫీసులకు వెళితే చాలా మంది ఊళ్లకు జంప్. ఇక కంటెంట్ రైటర్ల వరకూ ఇండ్ల నుంచే స్టోరీలు వార్తలు రాస్తూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప బయట తిరిగేందుకు సాహసించలేదు.
అయితే ఇంత గ్యాప్ తర్వాత భళ్లుమని ఒక మెసేజ్ సినీజర్నలిస్టుల్ని తీవ్రంగా కలతకు గురి చేసింది. అదేమిటి? అంటే.. మంగళవారం సాయంత్రం హోటల్ ట్రైడెంట్ లో `ఒరేయ్ బుజ్జిగా` (రాజ్ తరుణ్) ప్రీరిలీజ్ ఈవెంట్ కి జర్నలిస్టులు ఎటెండ్ కండి! అనేది దాని సారాంశం. ఈ మూవీ అక్టోబర్ లో ఓటీటీలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగైదు రోజులు సందడి చేసేందుకు టీమ్ రెడీ అయ్యింది.
చాలా గమ్మత్తుగా నిర్మాత కెకె.రాధామోహన్ మాత్రం.. రండి రండి రండి దయ చేయండి! అని పిలిచారు. మరి ఐదారు నెలల మానసిక వేదనను వదిలి సినీజర్నలిస్టులు ప్రీరిలీజ్ ఈవెంట్లో అడుగు పెడతారా పెట్టరా? జస్ట్ వెయిట్.. రేపటి(మంగళవారం) సాయంత్రమే పెళ్లికి బాజాలు మోగేది. ఈవెంట్ ని ఆస్వాధించి విందారగిస్తారా? అమ్మో కరోనా మావల్ల కాదంటారా?