Begin typing your search above and press return to search.
ఓరి దేవుడా.. 20 రోజుల్లోనేనా..!
By: Tupaki Desk | 11 Nov 2022 4:32 AM GMTమాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవల హీరోగా నటించిన చిత్రం "ఓరి దేవుడా!". దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న ఈ సినిమా థియేటర్లలో సందడి చేసింది. సినిమాకు మంచి రివ్యూస్ తో పాటుగా పాజిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ వసూళ్ళు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. అయితే ఇప్పుడీ సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.
"ఓరి దేవుడా!" సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను తీసుకున్న ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా వేదికగా.. గురువారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అంటే థియేట్రికల్ రిలీజ్ తర్వాత 3 వారాలు తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేసిందన్నమాట.
జీవితంలో సెకండ్ ఛాన్స్ వచ్చి, తప్పులను సరి చేసుకునే అవకాశం వస్తే అనేది "ఓరి దేవుడా" సినిమా కాన్సెప్ట్. యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ లవ్ డ్రామాగా తీర్చిదిద్దారు. ఇందులో విశ్వక్ సేన్ సరసన మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటించింది. విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ లో కనిపించగా.. ఆశా భట్ కీలక పాత్ర పోషించింది.
తమిళంలో అశోక్ సెల్వన్ - రితికా సింగ్ జంటగా నటించిన 'ఓ మై కడవులే' అనే సూపర్ హిట్ చిత్రానికి తెలుగు రీమేక్ "ఓరి దేవుడా..!" తెరకెక్కింది. ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు అశ్వత్ మరిముత్తు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. 'పెళ్లి చూపులు' ఫేమ్ తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందించడం విశేషం.
పీవీపీ సినిమా మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పెర్ల్ వి పొట్లూరి - పరమ్ వి పొట్లూరి - దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా.. విధు అయ్యన సినిమాటోగ్రఫీ నిర్వహించారు. విజయ్ ఎడిటింగ్ వర్క్ చేశారు.
"ఓరి దేవుడా..!" ఆహా డిజిటల్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో హీరో విశ్వక్ సేన్ ట్వీట్ చేస్తూ.. "తెలుగు ప్రేక్షకులు మా సినిమాను థియేటర్లలో ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు ఈ అందమైన చిత్రాన్ని మీ ఇంటికి తీసుకురావడం మా వంతు" అని పేర్కొన్నాడు.
'ఓరి దేవుడా' సినిమా ఆహా ఓటీటీ ద్వారా మరింత మందికి రీచ్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపని విశ్వక్ సేన్ సినిమా.. ఇప్పుడు డిజిటల్ రిలీజ్ లో ప్రేక్షకులను మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.