Begin typing your search above and press return to search.
భలే వాడేస్తున్నారుగా !
By: Tupaki Desk | 23 Aug 2019 4:41 AM GMTతెలుగులో ఈ మధ్య కోలీవుడ్ రీమేక్స్ సినిమాలు ఎక్కువవుతున్నాయి. ఒకటి తరవాత మరొకటి వరుస పెట్టి రీమేక్ సినిమాలొస్తున్నాయి. ప్రస్తుతం కథల కొరత ఉండటం, పైగా అక్కడ హిట్టయిన ఫార్ములా కావడంతో ఇప్పుడు కొందరి దర్శకుల దృష్టి తమిళ రీమేక్ సినిమాలపై పడుతుంది. కోలీవుడ్ లో ఆ మధ్య వచ్చిన 'రాక్షసన్' సినిమాను ఇటీవలే తెలుగులో 'రాక్షసుడు' టైటిల్ తో రీమేక్ చేసి బెల్లంకొండ శ్రీనివాస్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు రిలీజయిన 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమా కూడా తమిళ్ 'కణా' సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.
అయితే రీమేక్ సినిమాల్లో ఓ అడ్వాంటేజ్ కూడా ఉంది. అందుకే నిర్మాతలు కూడా వీటికే ఎక్కువగా ఓటేస్తున్నారు. ఒకప్పుడు సినిమాలో అద్భుతంగా నటించడం వల్ల రీమేక్ లో కూడా ఆ యాక్టర్స్ నే రిపీట్ చేసేవారు. ఇప్పుడు ఒరిజినల్ తాలూకు సన్నివేశాలను వాడుకోవడం కోసమే ప్రత్యేకంగా తమిళ నటులను తీసుకుంటున్నారు. 'రాక్షసుడు' సినిమాలో ఓ ఐదారుగురు నటీ నటులను రిపీట్ చేశారు. ముఖ్యంగా ఒరిజినల్ లో విలన్ గా నటించిన శరవణన్ ని తీసుకున్నారు. అతన్ని తీసుకోవడం ద్వారా ఒరిజినల్ సినిమాలో ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలను వాడుకోగలిగారు. ఇక 'కౌసల్య కృషమూర్తి' కూడా ఇంతే. 'కణా'లో నటించిన ఐశ్వర్య రాజేష్ నీ తెలుగులో కూడా తీసుకున్నారు. తద్వారా రెండో భాగంలో ముప్పై శాతం వరకూ ఒరిజినల్ కంటెంట్ ని వాడుకున్నారు.
నిజానికి ఇలా ఒరిజినల్ ఫుటేజ్ వాడుకోవడం వల్ల కొంత డబ్బుతో పాటు షూటింగ్ రోజులు కూడా కలిసొస్తాయి. కాకపోతే రైట్స్ తో పాటు సన్నివేశాలను కూడా వాడుకుంటున్న కారణంగా ఒరిజినల్ నిర్మాతకు కాస్త అధికంగా చెల్లించాల్సి వస్తుంది. రోజు షూటింగ్ ఖర్చు -అలాగే ఆర్టిస్టుల రెమ్యునరేషన్ కంటే ఇదే కాస్త బెటర్. కానీ ఇలా చేయడం వల్ల మన ఆర్టిస్టులకు పని తగ్గిపోతుంది. అదొక్కటి పక్కన పెడితే నిర్మాతకు మాత్రం డబ్బు మిగులే.