Begin typing your search above and press return to search.

న్యూ ఇయర్ కి బాహుబలి వస్తోంది

By:  Tupaki Desk   |   30 Dec 2017 10:00 AM IST
న్యూ ఇయర్ కి బాహుబలి వస్తోంది
X
ఆల్రెడీ బాహుబలి 1 వచ్చింది. బాహుబలి 2 కూడా రిలీజ్ అయ్యింది. బాహుబలి గేమ్.. యానిమేషన్ సిరీస్.. శివగామి నవల.. ఇలా అన్నీ రిలీజ్ అయిపోయాయ్. కాని అక్కడితో బాహుబలి ప్రస్థానం ముగిసిపోయింది అనుకుంటున్నారా? అబ్బే కాలేదు. ఎందుకంటే బాహుబలి నుండి ఇంకా ప్రపంచానికి పంచడానికి చాలా ఉంది. నమ్మరా? అయితే ఇది చదవండి.

ఇప్పుడు బాహుబలి సినిమాలో చాలా సీన్లలో మనకు గుర్తుండిపోయింది ఏంటి? రాజమౌళి ప్రతిభ.. ప్రభాస్ లుక్స్.. మైండ్ బ్లోయింగ్ యాక్షన్.. ఒళ్లు గగుర్పొడిచే డైలాగ్స్.. అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్.. వీటితో పాటు సదరు సీన్ల స్థాయిని కొత్త ఎత్తుకు తీసుకెళ్ళిన మ్యూజిక్ కూడా ఉందిగా. అందుకే ఇప్పుడు ఆ మ్యూజిక్ ను ప్రజలందరికీ పంచాలని అనుకుంటున్నారు. సాధారణంగా హాలీవుడ్ సినిమా విడుదలవ్వగానే.. సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోరులోని వివిధ గట్టాలను తీసుకుని.. 'ఒరిజినల్ స్కోర్' పేరుతో డివిడి రిలీజ్ చేస్తారు. ఇప్పుడు కూడా అదే తరహాలో బాహుబలి వారు కూడా ఒక సిడి రిలీజ్ చేయనున్నారు.

జనవరి 1న ఈ సినిమా తాలూకు ఒరిజనల్ బ్యాగ్రౌండ్ స్కోర్ ను ఇప్పుడు బాహుబలి టీమ్ రిలీజ్ చేయడానికి సన్నద్దమవుతోంది. మొత్తానికి 2018లో కూడా జనాలకు గుర్తుండిపోయేలా బాహుబలి జర్నీ కంటిన్యూ చేస్తున్నారనమాట.