Begin typing your search above and press return to search.

భరత్ సౌండ్ మామూలుగా ఉండదట

By:  Tupaki Desk   |   29 March 2018 5:20 AM GMT
భరత్ సౌండ్ మామూలుగా ఉండదట
X
హీరో సెంట్రిక్ మూవీస్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ఎంత ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడంటే షూటింగ్ హడావిడి - సెన్సార్ డెడ్ లైన్ - టైం లేకపోవడం లాంటి కారణాల వల్ల కొన్ని సినిమాల్లో చుట్టేస్తున్నారు కాని నిజానికి సంగీత దర్శకుడికి కావలసినంత సమయం స్వేచ్చ ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని గతంలో చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. ఉదాహరణకు టెంపర్ సినిమాకు మ్యూజిక్ అనూప్ రూబెన్స్ అయినా బ్యాక్ గ్రౌండ్ ఇచ్చిన మణిశర్మ అతనికంటే ఎక్కువ పేరు కొట్టేసాడు. తన పనితనాన్ని పూర్తి స్థాయిలో చూపించిన మణి తన సత్తా చాలా కాలం తర్వాత చూపించింది అందులోనే. ఒకప్పుడు ఇళయరాజా. రెహమాన్ - కీరవాణి వీళ్ళంతా దీంట్లో మాస్టర్లు గా పేరు తెచ్చుకున్నవాళ్ళే. ముప్పై ఏళ్ళ క్రితం వంశీ సితార అనే సినిమా తీసినప్పుడు రీ రికార్డింగ్ కాక ముందు వెర్షన్ చూసి కొందరు వంశీతో ఈ సినిమా వారం కంటే ఎక్కువ ఆడదని చెప్పారట. వంశీ అదే భయాన్ని ఇళయరాజా ముందు పెడితే బిజిఎం చేసాక చూడమని చెప్పారు. దాని తర్వాత జరిగింది చరిత్రే. శివ విషయంలోనూ రామ్ గోపాల్ వర్మకు ఇదే అనుభవం ఎదురైంది.

ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటారా. మహేష్ బాబు హీరోగా భరత్ అనే నేనులో ఈ స్థాయి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని దేవి శ్రీ ప్రసాద్ సెట్ చేసాడని తెలిసింది. అది ఏ రేంజ్ లో ఉంటుందంటే విడుదల అయ్యాక ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ని యు ట్యూబ్ లో కనక రిలీజ్ చేస్తే దాన్ని శ్రోతలు డౌన్ లోడ్ చేసుకుని మళ్ళి మళ్ళి వినేంతలా ఉంటుందని టాక్. ఇంత పేరు ఈ మధ్య కాలంలో ఒక్క బాహుబలి 2 కు మాత్రమే దక్కింది. అందులో ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ని భాగాలుగా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. భరత్ అనే నేను కూడా అదే స్థాయిలో ఉంటుందని వచ్చే ఎన్నికలలో రాజకీయ పార్టీలు దీన్ని తమ ప్రచారంలో థీమ్ మ్యూజిక్ గా వాడుకున్నా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. ఈ లెక్కన భరత్ అనే నేను సౌండ్ మామూలుగా ఉండదని తెలినట్టే.

భరత్ అనే నేను ఆడియో కం ప్రీ రిలీజ్ వేడుకను త్వరలోనే చేయనున్నారు. అమరావతి నుంచి హైదరాబాద్ కు వేదికను మార్చినట్టుగా ఇప్పటికే వార్తలు వచ్చిన నేపధ్యంలో యూనిట్ నుంచి అఫీషియల్ నోట్ రావాల్సి ఉంది. టైటిల్ ట్రాక్ ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ గా మారిన నేపధ్యంలో మిగిలిన పాటలపై చాలా హైప్ ఉంది. వరసగా భారీ సినిమాలతో దేవి శ్రీ ప్రసాద్ తన హవాని ఈసారి గట్టిగా సాగించేలా ఉన్నాడు.