Begin typing your search above and press return to search.
నెలకో స్టార్ ని టాప్ లో పెట్టి బాగానే ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు..!
By: Tupaki Desk | 16 July 2022 2:30 AM GMTబాలీవుడ్ మీడియా సంస్థ ఓర్మాక్స్ (ORMAX MEDIA) ప్రతీ నెల అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన నటీనటుల జాబితాను విడుదల చేస్తుందనే సంగతి తెలిసిందే. లేటెస్టుగా జూన్ నెలకు గాను మోస్ట్ పాపులర్ మేల్ అండ్ ఫీమేల్ తెలుగు స్టార్స్ లిస్టును ప్రకటించింది. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు స్టార్ హీరోయిన్ సమంత టాప్ ప్లేస్ లో నిలిచారు.
మే నెలలో అగ్ర స్థానంలో ఉన్న ప్రభాస్.. జూన్ లోనూ అదే ప్లేస్ లో కొనసాగారు. 2వ స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉన్నారు. పోయిన నెలలో ఇదే ఇదే ప్లేస్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఈసారి నాలుగులో ఉంటే.. తారక్ మాత్రం ఒక స్థానం మెరుగు పరుచుకున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ జాబితాలో 4వ స్థానాన్ని ఆక్రమించాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు నెలలుగా 5వ ప్లేస్ లోనే ఉన్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు నేచురల్ స్టార్ నాని కూడా అదే 6 మరియ 7 స్థానాల్లో కంటిన్యూ అయ్యారు. గత నెలలో 8వ స్థానంలో ఉన్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ - తొమ్మిదిలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈసారి పరస్పరం తమ స్థానాలను మార్చుకున్నారు. ఎప్పటిలాగే మాస్ మహారాజా రవితేజ 10వ ప్లేస్ లో ఉన్నాడు.
మోస్ట్ పాపులర్ ఫీమేల్ యాక్టర్ గా సమంత నిలసిస్తే.. ఆమె తర్వాత స్థానాన్ని కాజల్ అగర్వాల్ దక్కించుకుంది. పూజా హెగ్డే మరియు సాయి పల్లవి లు వరుసగా మూడు నాలుగు ప్లేస్ లలో ఉన్నారు. చాలా కాలంగా స్క్రీన్ మీద కనిపించని అనుష్క శెట్టి.. 5వ స్థానాన్ని ఆక్రమించింది. కీర్తి సురేష్ - తమన్నా భాటియా - రష్మిక మందన్నా - రకుల్ ప్రీత్ సింగ్ - కృతి శెట్టి ఈ జాబితాలో చోటు సంపాదించారు.
ఓర్మాక్స్ మీడియా సంస్థ 2010 నుండి ప్రతీ నెల ప్రజాదరణ పొందిన వారి జాబితాను ప్రకటిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఫిల్మ్ - టీవీ - ఓటీటీ - స్పోర్ట్స్ - మ్యూజిక్ విభాగాల్లో ఇలాంటి లిస్టును అందిస్తోంది. మొదట్లో కేవలం హిందీ యాక్టర్స్ జాబితాను మాత్రమే ప్రచురించగా.. ఆ తర్వాత రోజుల్లో అన్ని భాషల నటీనటులకు ర్యాంకులు ఇస్తోంది. ఈ క్రమంలో ఓటీటీ యాక్టర్స్ లిస్ట్ కీడ రెడీ చేస్తోంది.
అయితే ఓర్మాక్స్ మీడియా ఏ ప్రాతిపదికన మోస్ట్ పాపులర్ లిస్టును అందిస్తుందనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగా ఉంటుంది. సినిమాలు మరియు సోషల్ మీడియాలో పాపులారిటీ ప్రకారం ఇస్తారు అనుకోడానికి.. అసలు చాలా కాలంగా మూవీస్ చేయని వారు.. అసలు నెట్టింట చర్చించే అవకాశం లేని యాక్టర్స్ - యాంకర్స్ కూడా ఈ జాబితాలో ఉంటుంటారు.
టాలీవుడ్ స్టార్స్ విషయానికొస్తే గత రెండేళ్లలో మహేష్ బాబు టాప్ లో ఉంటూ వచ్చారు. అయితే గత ఏడెనిమిది నెలలుగా ఈ జాబితా మారుతూ వస్తోంది. ఒక నెలలో ఎన్టీఆర్ అగ్ర స్థానంలో ఉంటే.. రెండు నెలలుగా ప్రభాస్ ఉంటున్నాడు. అనుష్క శెట్టి - కాజల్ అగర్వాల్ - రకుల్ ప్రీత్ సింగ్ వంటి హీరోయిన్లు నటించిన సినిమాలేవీ మే - జూన్ నెలలో రాలేదు. వారి గురించి సోషల్ మీడియాలో చర్చించే అప్డేట్స్ కూడా ఏమీ లేవు.
ఇలా ఏ స్టార్ ఎందుకు టాప్ లో ఉంటున్నాడో.. తర్వాత నెలలో ఎందుకు కిందికి పడిపోతున్నాడో.. ఏది ప్రామాణికంగా తీసుకొని ఈ లిస్ట్ రెడీ చేస్తున్నారో అర్థం కావడం లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నెలకో స్టార్ ని అగ్ర స్థానంలో ఉంచి వారి ఫాలోయింగ్ బాగానే పెంచుకుంటున్నారని.. ప్రతీ నెల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఫైట్ చేసుకోడానికి కారణమవుతున్నారని అభిప్రాయ పడుతున్నారు.